మసాజ్ ముసుగులో వ్యభిచారం, నెలలుగా అత్యాచారం
హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలోని ఓ సెలూన్ అండ్ స్పా సెంటరులో మసాజ్ ముసుగులో వ్యభిచారం జరుగుతోంది.
సమాచారం అందటంతో సోమవారం నాడు పోలీసులు దాడి చేశారు. ఆ దాడిలో ఓ మహిళతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. నిర్వాహకులు మోతీనగర్‌కు చెందినవారు. వారితో పాటు ఓ విటుడిని అరెస్టు చేశారు.
బాలికపై బాబాయి వరస వ్యక్తి రేప్

వరుసకు బాబాయి అయిన ఓ వ్యక్తి బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నల్గొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల బాలిక తండ్రి ఇటీవల చనిపోయాయుడ. దీంతో ఇటీవల వరుసకు బాబాయి అయిన బాలు బాలిక ఇంటికి వచ్చేవాడు.
ఆ బాలికను బాలు నగరానికి తీసుకు వచ్చాడు. చంపాపేటలో తాను ఉంటున్న గదికి తీసుకు వెళ్లి మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి తల్లి వద్దకు వెళ్లిన బాలిక విషయం చెప్పింది. దీంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాలికపై రేప్, డ్రైవర్ అరెస్టు
బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన ఓ ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహేష్ అనే ఆటో డ్రైవర్‌కు ఫిలిం నగర్‌కు చెందిన ఓ బాలికతో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నార్సింగికి తీసుకు వెళ్లి ఆమెను లోబరుచుకున్నాడు. అందరికీ చెబుతానని బెదిరించి మూడు నెలలుగా పదేపదే అత్యాచారం చేశాడు. బాలిక ఎట్టకేలకు తల్లికి చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications