ఫైనల్లీ తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు ..ఇప్పుడైనా మల్లన్నను కేసీఆర్ సర్కార్ విడిచిపెడుతుందా? హాట్ డిబేట్
అనేక చీటింగ్ కేసులలో ఇరుక్కుని గత రెండు నెలలకు పైగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ చిలకలగూడాతో సహా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో తీన్మార్ మల్లన్న ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఒక కేసులో బెయిల్ పై బయటకు రాగానే మరో కేసులో తీన్మార్ మల్లన్నను ఇరికించి జైలుకు పంపించారని చర్చ ప్రధానంగా జరిగింది. ఇక ఈ కేసులలో సతమతమవుతున్న తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు సోమవారం నాడు బెయిలు మంజూరు చేసింది.

తీన్మార్ మల్లన్నపై వరుస కేసులు .. కేసీఆర్ పాలన మల్లన్న టార్గెట్ చెయ్యటమే కారణం
తెలంగాణ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తీన్మార్ మల్లన్నపై కేసులు నమోదు చేయించిందని మల్లన్న టీం ఆరోపణలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీపై, కెసిఆర్ కుటుంబ పాలనపై ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. తనదైన శైలిలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు .
రాష్ట్రంలో ప్రముఖ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ తనను తీన్మార్ మల్లన్న 30 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొదట తీన్మార్ మల్లన్న పై కేసు నమోదైంది.

ఒక కేసు నుండి బయటకు రాగానే తీన్మార్ మల్లన్నను మరో కేసులో ఇరికిస్తున్న ప్రభుత్వం
ఆ తరువాత చీటింగ్ కేసు నుండి బెయిల్ పై బయటకు వచ్చిన తీన్మార్ మల్లన్నపై నిజామాబాద్ జిల్లాలో కల్లు వ్యాపారి వద్ద మల్లన్న టీం డబ్బులు వసూలు చేస్తుందని మల్లన్న టీం సభ్యులపై మాత్రమే కాకుండా, తీన్మార్ మల్లన్న పై కూడా మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులలో తీన్మార్ మల్లన్నకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇక తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు, మల్లన్న పై చేసిన బెదిరింపు ఆరోపణలు, తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఉన్న కంప్యూటర్లను, హార్డ్ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిపై కొనసాగిస్తున్న దర్యాప్తు వెరసి మొత్తంగా తీన్మార్ మల్లన్న రెండు నెలలకు పైగా జైలు జీవితాన్ని గడిపాడు.

అమిత్ షా కు తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేసిన మల్లన్న భార్య
ఇక తాజాగా తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు బనాయించారని తీన్మార్ మల్లన్న భార్య అమిత్ షా కు ఫిర్యాదు చేసింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తీన్మార్ మల్లన్న పరిస్థితిపై భార్య మాతమ్మ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసి తీన్మార్ మల్లన్న పై 38 అక్రమ కేసులు బనాయించారని ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి కావాలని ఆయనను బయటకు రాకుండా చేస్తున్నారని అమిత్ షా కు తీన్మార్ మల్లన్న పై పెట్టిన కేసులతో కూడిన నివేదికను అందించారు .
జైలు నుండి తన భర్తను విడుదల చేయించాలని అమిత్ షా కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నందుకు తన భర్తను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఆమె అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు.

మొత్తం కేసులలో 6 కేసులు కొట్టివేత, ఒక కేసు మినహా మిగతా 31 కేసుల్లో బెయిల్
ఇదిలా ఉండగా తాజాగా తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకు తీన్మార్ మల్లన్న పై 38 కేసులు నమోదు కాగా అందులో ఆరు కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులలో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న గత డెబ్భై నాలుగు రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఒక పక్క జాతీయ బీసీ కమిషన్ కూడా తీన్మార్ మల్లన్న పై నమోదు చేసిన కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరు కావడంతో సోమవారం సాయంత్రం మల్లన్న జైలు నుండి బయటకు రానున్నారు.

ఇప్పుడైనా తెలంగాణా సర్కార్ తీన్మార్ మల్లన్నను విడిచిపెడుతుందా ?
తెలంగాణా ప్రభుత్వం తీన్మార్ మల్లన్నను పదే పదే టార్గెట్ చేసి వివిధ కేసులలో ఇరికించి ఇబ్బంది పెడుతున్న క్రమంలో మల్లన్న తాజాగా బెయిల్ పై బయటకు రానున్నారు. మరి ఇప్పుడైనా మల్లన్నను కేసీఆర్ సర్కార్ విడిచిపెడుతుందా? లేదా మళ్ళీ ఏదో ఒక కేసులో ఇరికిస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తీన్మార్ మల్లన్న గతంలోలా మళ్ళీ కేసీఆర్ పై దూకుడు చూపిస్తారా? లేకా సైలెంట్ గా ఉంటారా అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications