జీఎస్టీతో తెలంగాణకు ఏటా రూ.5వేల కోట్ల నష్టం! కేంద్ర హామీ ఏంటి?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎట్టకేలకు పార్లమెంటులో బుధవారం ఆమోదం పొందిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లకుపైగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతమేర నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఐదేళ్ల పాటు ఈ నష్ట పరిహారాన్ని కేంద్ర భరించనుంది.

ఐదేళ్ల తర్వాత మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతమేర నష్టపోవాల్సిందేనని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.32 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల మేరకు ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

అయితే, తాజాగా జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించటంతో వచ్చే ఏప్రిల్ నుంచి జీఎస్‌టీ చట్టం అమల్లోకి రానుంది. దీంతో 2017 నుంచి వ్యాట్‌కు బదులు రాష్ట్రంలో స్టేట్ జీఎస్‌టీ, సెంట్రల్ జీఎస్‌టీ మాత్రమే వసూలు చేస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నష్టపోనుంది.

Telangana apprehensive over GST loss

ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులపై పన్నుల వసూలు నిలిచిపోతుంది. దీంతోపాటు అంతర్రాష్ట్ర సీఎస్‌టీ వసూలు ఒక శాతానికి తగ్గిపోతుంది. అలాగే కేంద్ర పన్నుల వాటాలో 12.5 శాతం పన్నులున్న కొన్ని ఉత్పత్తులకు కేవలం 5 శాతం పన్ను విధిస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.5వేల కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.

ఆమేర నష్టపరిహారం ఇస్తామని కేంద్రం చెప్పినా.. నిధుల కోసం రాష్ట్రం ఎదురుచూడక తప్పదు. కానీ జీఎస్‌టీతో రాష్ట్రాలు నష్టపోయే మొత్తం సామాన్యులకు లాభంగా మారుతుందనడంలో సందేహం లేదు. వ్యవసాయ, ఇతర ఉత్పత్తులపై పన్ను మినహాయించటంతో అంతమేరకు వినియోగదారులకు లాభం చేకూరుతుంది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Though the Telangana State government supports the much delayed GST (Goods and Services Taxes) Bill which was adopted by Rajya Sabha on Wednesday, the government has its own fears on the quantum of RNR (Revenue Neutral Rate) percentage on the State revenues.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి