ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. బాబూ జగ్జీవన్ రామ్ కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అప్పగించి గౌరవించిందన్నారు. రాజ్యాంగ బాధ్యతలతోపాటు బాబా సాహెబ్ అంబేద్కర్‌ను తొలి న్యాయశాఖ మంత్రిని చేసిందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదర సంజీవయ్యను కాంగ్రెస్ పార్టీనే సీఎంగా చేసిందన్నారు.

Telangana Assembly approves SC classification bill

ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్నారు. 2004లో ఉషా మెహ్రా కమిటీ వేసి సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇన్నాళ్లకు తాను ముఖ్యమంత్రిగా ఉండగానే సమస్య పరిష్కారం సంతోషంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే నిర్ణయం ప్రకటించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉప సంఘం నియమించామని అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు షమీమ్ అక్తర్ కమిషన్ నియమించామని సీఎం రేవంత్ చెప్పారు. ప్రజల నుంచి 8681 ప్రతిపాదనలు స్వీకరించిందని, కమిషన్ అందించిన నివేదికను ఏ మాత్రం మార్చకుండా ఆమోదించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనమండలి కూడా ఆమోదం

59 ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా కమిషన్ విభవించిందన్నారు. 59 కులాలు ఇప్పటి వరకు పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫార్సులు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు ముఖ్యమంత్రి కృతజ్ఝతలు తెలిపారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీతోపాటు అన్ని రాజకీయ పార్టీల సభ్యులు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు పలికాయి. తమ పార్టీ చొరవ వల్లే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం లభించిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు పలికామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనమండలి కూడా ఆమోదం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+