ఈసీ కొత్త రూల్స్, తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ఆలస్యం: కారణాలివే, డిస్‌ప్లేల ఏర్పాటు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు మూడు రోజుల క్రితం ముగిశాయి. ఓట్ల లెక్కింపు మంగళవారం (రేపు) ఉదయం ప్రారంభం కానుంది. దీనిపై తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ మాట్లాడారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 43 కౌటింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
ఒక్కో నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఉన్నాయని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తామని చెప్పారు. మొత్తం 2,379 రౌండ్లు ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు ఫలితాలు వచ్చే అవకాశముందని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధిక రౌండ్స్ ఉంటాయని చెప్పారు. బెల్లంపల్లిలో అత్యల్పంగా రౌండ్స్ ఉంటాయన్నారు.

అభ్యర్థులకు చూపించిన తర్వాతే ఫలితాలు
ప్రతి రౌండ్‌లోని ఆయా నియోజకవర్గంలోని అభ్యర్థులకు చూపించిన తర్వాతనే ఫలితాలు ఇస్తామని సీఈవో రజత్ కుమార్ వెల్లడించారు. అవసరమైన చోట్లే వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. కాగా, ఎన్నికల సంఘం కొత్త రూల్స్ వలన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నాయి.

అభ్యర్థులు అభ్యంతరం చెప్పకుంటేనే
రేపు తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల (మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంది. ఎన్నికల సంఘం కొత్త నిబంధనల ప్రకారం ప్రతి రౌండ్ ఫలితాన్ని స్టేట్‌మెంట్ రూపంలో అభ్యర్థులకు అధికారులు ఇస్తారు. అభ్యర్థులు ఎలాంటి అభ్యంతరం చెప్పకుంటే రిటర్నింగ్ అధికారి మీడియాకు ఫలితం వెల్లడిస్తారు.

ప్రతి రౌండ్ ఫలితం వెబ్‌సైట్‌లో
అధికారులు ప్రతి రౌండ్ ఫలితాన్ని కూడా వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తారు. ప్రతి రౌండ్‌ను స్టేట్‌మెంట్ రూపంలో పెట్టిన తర్వాతనే ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. దీని కారణంగా గతం కంటే ఫలితాల వెల్లడి రెండు గంటలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కట్టుదిట్టమైన భద్రత
ఇదిలా ఉండగా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని అడిషనల్ డీజీ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం కౌంటింగ్ రికార్డ్ అవుతుందని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద 28 కంపెనీ ఫోర్స్ ఉన్నాయని చెప్పారు. 144వ సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. రేపు మధ్యాహ్నం కల్లా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశముందని చెప్పారు.

ప్రజల కోసం డిస్‌ప్లేలు
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని డీజీ తెలిపారు. కౌంటింగ్ హాల్స్‌లోకి సెల్‌ఫోన్స్‌ను అనుమతించడం లేదని చెప్పారు. కౌంటింగ్ వద్ద ప్రజలు, ఆయా పార్టీల కార్యకర్తల కోసం డిస్‌ప్లేలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, కౌంటింగ్ హాల్స్‌లో వెబ్ క్యాస్టింగ్, వైఫైకి అనుమతి లేదు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications