హరీష్ రావుకు గట్టి ధమ్కీ ఇచ్చిన రేవంత్ రెడ్డి!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆర్టీసీపై వాడి వేడీగా చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్టీసీ అంశంపై హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్ రావు గతంలో ఆర్టీసీ కార్మిక గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారని, ఆ పదవీ నుంచి ఆయనను తప్పించలేక ఏకంగా బీఆర్ఎస్ కార్మిక సంఘాలనే రద్దు చేసిందని గుర్తుచేసారు సీఎం రేవంత్ రెడ్డి.

సభలో ఆర్టీసీపై రగడ
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్, ప్రజా రవాణా సదుపాయాలు తమ బాధ్యతలనీ ప్రభుత్వం పేర్కొంది. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షాల మధ్య ఆర్టీసీ ఉద్యోగుల అంశాలపై వాగ్వివాదం జరగటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయం స్పష్టం చేశారు.

Telangana assembly session 2024 Revanth Reddy vs Harish Rao on RTC

హరీష్ రావుపై మండిపడిన రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని హరీష్ రావుకు ధమ్కీ ఇచ్చారు. దీర్ఘకాలం పాటు శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు స్పీకరు నిర్ణయాన్ని ప్రశ్నించటం సరికాదని అన్నారు. సభ అజెండా సభ సొత్తు అని చెబుతూ, ప్రతి సభ్యునికీ మాట్లాడే అవకాశం ఉంటుందని ఈ విషయంలో స్పీకరు నిర్ణయాన్ని ప్రశ్నించటం సరి కాదని అన్నారు. కొత్త సభ్యులు నిబంధనలు తెలుసుకుని వ్యవహరించాలని సూచించారు.

ఆర్టీసీపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు
అంతకు ముందు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్నీ చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని నిర్వాహక నష్టాలనుంచి బయటకు తెచ్చినట్లూ, మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 2 వేల కోట్ల రూపాయిలను ఆర్టీసీకి అందించినట్లు చెప్పారు. ఆర్టీసీని గత ప్రభుత్వం అన్ని రకాలుగా నిర్వీర్యం చేసిందని మంత్రి ఆరోపించారు.

గత ప్రభుత్వంపై ఆరోపణల వర్షం
2013 నుండి పెండింగ్ లో ఉన్న 280 కోట్ల బాండ్ల బకాయిలలో 80 కోట్ల రూపాయిలను తమ ప్రభుత్వం చెల్లించినట్లూ, కొత్త బస్సులను కొనుగోలు చేసి సంస్థకు జవజీవాలు ఇచ్చినట్లూ మంత్రి చెప్పారు. మూడు వేల పైగా ఉద్యోగాల నియామకాలు చేపట్టినట్లూ, ఆక్యుపెన్సీని 95 శానికి పెంచినట్లూ పేర్కొన్నారు. 35 కోట్ల రూపాయిల భారం పడినా, ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం పీఆర్సి ఇచ్చినట్లు గుర్తు చేశారు.
గత ప్రభుత్వం బడ్జెట్ లో 1500 కోట్ల రూపాయిలు పెట్టి, 400 కోటు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.

పోడియం వద్దకు దూసుకెళ్లిన బీఆర్ఎస్.. రచ్చ రచ్చ
అంతకు ముందు, బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు ప్రశ్నలు లేవనెత్తుతూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ను ఎప్పటికీ పూర్తి చేస్తారని అడిగారు. మంత్రి సమాధానాలతో సంతృప్తి చెందని ఆర్టీసీ సభ్యులు తమకు నిరశన తెలిపే అవకాశం ఇవ్వలంటూ పదే, పదే స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్ళడంతో అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. సీపీఐ సభ్యులు సాంబశివరావు మాట్లాడుతూ, 50 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+