వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈనెల 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ -18న బడ్జెట్ సమర్పరణ -నోటిఫికేషన్ జారీ -14న ఎమ్మెల్సీ ఎన్నికలు

|
Google Oneindia TeluguNews

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలకు సంబంధింది మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. అందులోని వివరాల ప్రకారం..

మార్చి 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. తర్వాతి రోజైన 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఇక..

మహేశ్ బాబును పెట్టి కోట్లు ఇవ్వలేం -దేత్త‌డి హారికనే అంబాసిడర్ -తొలగింపు వట్టిదే: TSTDC చైర్మన్ క్లారిటీమహేశ్ బాబును పెట్టి కోట్లు ఇవ్వలేం -దేత్త‌డి హారికనే అంబాసిడర్ -తొలగింపు వట్టిదే: TSTDC చైర్మన్ క్లారిటీ

Telangana assembly session begins on March 15, TS budget 2021 presentation on March 18

అతి కీలకమైన రాష్ట్ర బడ్జెట్ ను ఈనెల 18న ప్రవేశపెట్టనున్నారు. ఆ వచ్చే గురువారం(18న) ఉదయం 11:30 నిమిషాలకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. కరోనా విలయం కారణంగా తెలంగాణ ఆదాయం రూ.50 వేల కోట్లు కోల్పోయినప్పటికీ, బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుందని, కేటాయింపులు గట్టిగానే ఉండాలని సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్షలో వ్యాఖ్యానించారు. కాగా,

గుడ్ న్యూస్: US H1B visa రిజిస్ట్రేషన్-2022 ప్రారంభం -ప్రక్రియ పూర్తి వివరాలివే..గుడ్ న్యూస్: US H1B visa రిజిస్ట్రేషన్-2022 ప్రారంభం -ప్రక్రియ పూర్తి వివరాలివే..

ప్రస్తుతం రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఖమ్మం-నల్గొండ-వరంగల్ స్థానంతోపాటు రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతోన్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద ఎత్తున స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 14న జరుగనుంది. ఆ తర్వాతి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

English summary
The Budget session of the Telangana Legislative Assembly and Council will begin on March 15 with Governor Tamilisai Soundararajan addressing a joint session of both the Houses on the opening day. Finance Minister T Harish Rao will present the State budget for 2021-22 financial year on March 18. A notification to this effect was issued on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X