తెలంగాణా బంద్ సక్సెస్.. బీసీల జంగ్ సైరన్ దద్దరిల్లిందిగా!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ 'బంద్ ఫర్ జస్టిస్' పేరిట బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలు సహా పలు రాజకీయపార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు, మానవహారాలు చేపట్టారు.
డిపోలకే పరిమితం అయిన ఆర్టీసీ బస్సులు
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా సౌకర్యం లేక ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని పలు ప్రాంతాల్లో క్యాబ్లు, ప్రైవేటు రవాణా వాహనాల డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.

బీసీ బంద్ లో అన్ని జిల్లాలలో ధర్నాలు, రాస్తారోకోలు
బంద్ కు మద్దతుగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడగా, విద్యా సంస్థల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. అత్యవసర సేవలకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆసిఫాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, కొత్తగూడెం, సిరిసిల్ల, నిర్మల్, మెదక్,నాగర్ కర్నూల్, వరంగల్ , హన్మకొండ తదితర జిల్లాల కేంద్రాల్లో బీసీ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
తెలంగాణా బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ మంత్రులు
బీసీ జేఏసీ నాయకులు హైకోర్టు స్టే ఆర్డర్ ను నిరసిస్తూ తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సైతం బంద్ లో పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన దేనిని డిమాండ్ చేశారు బిజెపి, బి ఆర్ ఎస్ తోడు దొంగలని బీసీ ద్రోహులని మండిపడ్డారు.
బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటా ఇవ్వాల్సిందే
రాష్ట్ర గవర్నర్ ఒక్క సంతకం పెట్టి బిసి బిల్లుకు ఆ సమస్య వచ్చేది కాదని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవని, బిజెపి డ్రామా వల్లనే, బీసీల ఆశలన్నీ అడియాసలయ్యాయి అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు రావలసిన న్యాయమైన వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
బంద్ లో పాల్గొన్న కేసీఆర్ తనయ కవిత
మరోవైపు కేసీఆర్ తనయ కవిత కూడా బంద్ లో పాల్గొన్నారు. ఖైరతాబాద్లో బంద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవహారం లో పాల్గొన్న కవిత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు తమ ఆందోళన విరమించేది లేదన్నారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
తెలంగాణ డిస్కంలకు సింగరేణి ఊహించని షాక్.. రాజస్థాన్ కు కరెంట్ విక్రయం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications