ప్రగతి భవన్ టు గాంధీభవన్ .. నెక్ట్స్ టీపీసీసీ చీఫ్‌గా కేసీఆర్
తెలంగాణ రాజకీయం హీట్ పుట్టిస్తోంది. గులాబీ, కమలం నేతల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. గులాబీ అధినేతపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ వల్ల తెలంగాణ ఆగం అవుతుందని మండిపడ్డారు. దేశంలో నెంబర్ వన్ అవినీతిపరుడు కేసీఆర్ అని ఆరోపించారు.

తదుపరి పీసీపీ ప్రెసిడెంట్ కేసీఆరే ..
సీఎం కేసీఆర్ ఈ మధ్య ఢిల్లీలోని 10 జన్ పథ్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను ఫాలో అవుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నెక్ట్స్ పీసీసీ ప్రెసిడెంట్ కేసీఆర్ అవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో టీపీసీసీ ప్రెసిడెంట్ కావాలని, ముఖ్యమంత్రి కావాలంటే ఆమె అంగీకరించలేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ నుంచి గాంధీభవన్‌కు మారబోతున్నారని ఎద్దేవా చేశారు. తదుపరి పీసీపీ ప్రెసిడెంట్ కేసీఆరే అని బండి సంజయ్ సెటైర్లు విసిరారు..
Recommended Video

దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి..
దేశం కోసం పోరాడుతున్న జవాన్ల త్యాగాలను కించపరిచేలా సీఎం కేసీఆర్ మాట్లాడటం దేశద్రోహమేనని బండి సంజయ్ మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని మాట్లాడటం సరికాదన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై సైన్యాన్ని, ప్రధాని మాటలను కేసీఆర్ నమ్మడం లేదన్నారు. తమపై దాడి జరిగిందని పాకిస్థాన్ ఒప్పుకుంటే, కేసీఆర్ మాత్రం ఒప్పుకోరా? అని నిలదీశారు . మరి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహర్ చెబితే నమ్ముతారా ? అని కేసీఆర్ ని ప్రశ్నించారు. సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడిన కేసీఆర్ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..

కేసీఆర్ డీఎన్ఏ టెస్ట్ చేయించాలి..
సైన్యాన్ని అనుమానిస్తోన్న కేసీఆర్ ఏ దేశానికి మద్దతు పలుకుతున్నారో చెప్పాలన్నారు బండి సంజయ్. చైనా మీద కేసీఆర్ బాగా ప్రేమ చూపుతున్నారని.. సీఎంకి ఏమి పుట్టిందో అర్థం కావడం లేదని విమర్శించారు. రఫేల్ డీల్‌లో సుప్రీం కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. రఫెల్ కొనుగోళ్లపై కేసీఆర్ వ్యాఖ్యలు సుప్రీం కోర్ట్ను ధిక్కరించడమే అవుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడే పుట్టాడా సందేహాం వ్యక్తం అవుతుందన్ని విమర్శించారు.. ఆయన డీఎన్ఎ టెస్ట్ చేయించాలని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications