కేసీఆర్‌ను కలిసేందుకు నో: బీజేపీ ఎమ్మెలేల ధర్నా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుని కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేఎల్సీ నేత లక్ష్మణ్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం సచివాలయానికి వచ్చారు. అయితే సీఎం కేసీఆర్ వారికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.

దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలోని సి-బ్లాక్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అంతక ముందు ఎమ్మెల్యే లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో జీహెచ్‌ఎంసీ ప్రదర్శిస్తోన్న తీరు ఎంత మాత్రం సరికాదని లక్ష్మణ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications