హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ రెండో జాబితా విడుదల: 28మంది అభ్యర్థులు వీరే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ తన కోర్ కమిటీ సమావేశం అనంతరం రెండో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 28మందికి చోటు కల్పించింది. మొదటి జాబితాలో 38మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండో జాబితాలో రాజేంద్రనగర్ నుంచి బద్దం బాల్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, మలక్‌పేట్ నుంచి ఆలే జితేంద్ర, వరంగల్ పశ్చిమ నుంచి ధర్మారావులకు చోటు కల్పించింది.

రెండో జాబితాలో ఉన్న మొత్తం అభ్యర్థుల వివరాలు:

Telangana bjp releases second list with 28

నిజామాబాద్ అర్బన్- యెండెల లక్ష్మీనారాయణ
జగిత్యాల- ముదుగంటి రవీందర్ రెడ్డి
రామగుండం- వనిత
సిరిసిల్ల- నర్సాగౌడ్
సిద్ధిపేట- నాయిని నరోత్తమ్ రెడ్డి
కూకట్‌పల్లి- మాధవరం కాంతారావు
రాజేంద్రనగర్- బద్ధం బాల్ రెడ్డి
శేరిలింగంపల్లి- యోగానంద్
మలక్‌పేట్- ఆలె జితేంద్ర
చార్మినార్- ఉమా మహేందర్
చాంద్రాయణగుట్ట- సయ్యద్ షెహజాది
యాకుత్‌పుర- చార్మాని రూప్‌రాజ్
బహదూర్‌పుర- హనీఫ్ అలీ
దేవరకద్ర- అగ్గని నర్సింహులు సాగర్
వనపర్తి- కొత్త అమరేందర్ రెడ్డి
నాగర్ కర్నూల్- నేదనూరి దిలీప్ చారి
నాగార్జునసాగర్- కంకణాల నివేదిత
ఆలేరు- దొంతిరి శ్రీధర్ రెడ్డి
స్టేషన్ ఘన్‌పూర్- పెరుమాండ్ల వెంకటేశ్వర్లు
వరంగల్ వెస్ట్- ధర్మారావు
వర్ధన్నపేట- కొత్త సారంగరావు
ఇల్లెందు- మోకాళ్ల నాగ స్రవంతి
వైరా- భుక్యా రేష్మాభాయ్
అశ్వారావుపేట- -భుక్యా ప్రసాదరావు
సిర్పూర్ కాగజ్‌నగర్- శ్రీనివాసులు
ఆసిఫాబాద్- అజ్మీరా ఆత్మారాం నాయక్
ఖానాపూర్- సాట్ల అశోక్
నిర్మల్- ఐండ్ల సువర్ణారెడ్డి

రెండు జాబితాల్లో 68మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మరో 53స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, రెండో జాబితాలో తమకు చోటు దక్కలేదన్న కోపంతో పలువురు నేతలు బీజేపీ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. కార్యాలయాల్లోని ఫర్నీచర్ ధ్వంసం చేసిన నిరసన తెలిపారు. వరంగల్ పశ్చిమ నుంచి ఆరుసార్లు ఓడిపోయిన ధర్మారావుకు టికెట్ ఎలా ఇస్తారని రావు పద్మ ప్రశ్నించారు. ఆమె బీజేపీ పెద్దల వద్ద తన నిరసన వ్యక్తం చేశారు.

English summary
Telangana bjp releases second list with 28 candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X