వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతసామరస్యానికి ప్రతీకలు తెలంగాణ బోనాలు.!ఘనంగా నిర్వహిస్తామన్న మంత్రి తలసాని.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం ఎమ్సీహెచ్ఆర్డీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం, అంబర్ పేట మహంకాళి దేవాలయం, గోల్కొండ దేవాలయం, ఉమ్మడి దేవాలయాలు తదితర దేవాలయాల కమిటీ సభ్యులు, బోనాల ఉత్సవాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

 హైదరాబాద్ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామన్న తలసాని

హైదరాబాద్ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామన్న తలసాని


ఈ నెల 30 నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 30 న గోల్కొండ బోనాలు, జులై 17 న సికింద్రాబాద్, 24 వ తేదీన హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. హైదరాబాద్ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని తలసాని గుర్తు చేశారు.

 కరోనా కారణంతో గత రెండు సంవత్సరాలుగా జరుపుకోలేదు.. ఈ సారి వైభవంగా ఉత్సవాలన్న మంత్రి

కరోనా కారణంతో గత రెండు సంవత్సరాలుగా జరుపుకోలేదు.. ఈ సారి వైభవంగా ఉత్సవాలన్న మంత్రి


గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా బోనాలను ఘనంగా జరుపుకోలేకపోయినట్లు మంత్రి తలసాని వివరించారు. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా సుమారు 3 వేల ప్రయివేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.

 ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న తలసాని

ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న తలసాని


ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

 ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు.. సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దన్న మంత్రి తలసాని..

ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు.. సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దన్న మంత్రి తలసాని..


భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని అన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదనంగా ప్రభుత్వ పరమైన ఏర్పాట్లు అవసరమైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.

English summary
Minister of State for Animal Husbandry, Fisheries and Dairy Development and Cinematography Talsani Srinivas Yadav said that the Bonalu festival would be held in a manner that reflects the culture of Telangana. On Monday, a meeting was held at the MCHRD under the chairmanship of Minister Talsani Srinivas Yadav on the organization and arrangements for the Bonalu festivities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X