• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్ ఇకపై ఇలా ఉండదు.. తెలంగాణ బడ్జెట్ 2020 హైలైట్స్.. సరికొత్త ప్రతిపాదనలు ఇవే..

|

వార్షిక బడ్జెట్ లో భాగంగా ఆయా శాఖలకు కేటాయింపులతోపాటు కొన్ని సరికొత్త ప్రతినాదనలనూ రూపొందిచామని, హైదరాబాద్ సిటీతోపాటు వివిధ అంశాల్లో కీలకమైన మార్పునకు అవి కారణభూతమవుతాయని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం తర్వాత మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రతిపాదనల గురించి హరీశ్ ఇలా చెప్పారు..

 హైదరాబాద్ అర్బన్ అగ్లామిరేషన్

హైదరాబాద్ అర్బన్ అగ్లామిరేషన్

గత పాలకులు పట్టించుకోకపోవడం వల్లే.. చిన్న వర్షానికే హైదరాబాద్ అతలాకుతలమైపోయే పరిస్థితి తయారైందని సీఎం గతంలో పదే పదే ప్రస్తావించారు. దీని గురించి సీఎం చాలా సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దేశానికి ముఖచిత్రాలుగా ఉన్నహైదరాబాద్ తోపాటు ఐదు మెట్రో నగరాలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం సరిగా స్పందించలేదు. దీంతో మేమే ప్రణాళికలు రూపొందించుకున్నాం. హైదరాబాద్ సిటీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దుకోడానికి రూ.50వేల కోట్లు అవసరం అనే అంచనాకు ప్రభుత్వం వచ్చింది. ‘హైదరాబాద్ అర్బన్ అగ్లామిరేషన్'గా పేరుపెట్టుకున్న ఈ కార్యక్రమానికి ఈ ఏడాది బడ్జెట్ లో రూ.10 వేట్లు పెట్టాం. నిజానికి ఇది చాలా పెద్ద నిర్ణయం.

ఆ పనుల బాధ్యత సర్కారుదే..

ఆ పనుల బాధ్యత సర్కారుదే..

రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీళ్లు అందించే మిషన్ భగీరథ పథకానికి సంబంధించి దాదాపు పనులు పూర్తికావచ్చాయి. అయితే ఓ 38 పట్టణాల్లో కాంట్రాక్టులు పొందిన సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడా పనుల్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తిచేయాలని నిర్ణయించాం. అందుకోసం రూ.800 కోట్లు పెట్టాం. యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని సంబంధిత శాఖలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.

గోదావరి రివర్ ఫ్రెంట్..

గోదావరి రివర్ ఫ్రెంట్..

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. తెలంగాణలో గోదావరి నది 150 కిలోమీటర్ల పొడవునా.. 365 రోజులూ నీళ్లతో కళకళలాడే పరిస్థితి నెలకొంది. సుమారు 2కిలోమీర్ల వెడల్పుతో.. ఆ 150 కిలోమీటర్ల ప్రాంతం అందాలకు నిలయంగా మారింది. ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులు అక్కడికి వెళుతున్నారు. కాబట్టి దాన్నొక టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి రివర్ ఫ్రంట్ టూరిజం పేరుతో చేపట్టబోయే ప్రాజెక్టుకు ఇవాళ్టి బడ్జెట్ లో రూ.300 కోట్లు పెట్టాం. ప్రస్తుతం ఒక స్టార్టప్ ఈవెంట్ గా దీన్ని ప్రారంభించి.. మున్ముందు అద్భుతంగా తీర్చిదిద్దుతాం.

మొక్కల పెంపకానికి రూ.300 కోట్లు

మొక్కల పెంపకానికి రూ.300 కోట్లు

మొక్కల పెంపకానికి హరితహారం కార్యక్రమం మరిత వేగంగా ముందుకెళ్లేలా మొట్టమొదటిసారి అటవీ శాఖకు కూడా రూ.300 కోట్ల నిధులు ఇచ్చాం. ఫారెస్టు శాఖ రెగ్యులర్ నిధులు, కంపా నిధులకు అదనంగా ఈ రూ.300 కోట్లు హరితహారం కింద ఇస్తున్నాం.

అందరికీ విద్య..

అందరికీ విద్య..

సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం రూ.100 కోట్లు పెట్టాం. ‘ఈచ్ వన్ టీచ్ వన్' అనే సీఎం కేసీఆర్ నినాదాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిధులు ఉపయోగ పడతాయి. ఇటు వెల్ఫేర్ స్కీంలకు కూడా గత ఏడాదితో పోల్చుకుంటే 15 శాతం నుంచి 50 శాతం దాకా నిధులు పెంచాం.

జీఎస్టీ కంపన్సెషన్..

జీఎస్టీ కంపన్సెషన్..

2017-18లో జీఎస్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా జీఎస్టీని క్లెయిమ్ చేయలేదు. ఆ ఏడాది రూ.514కోట్లు ఎక్కవే ఆదాయం వచ్చింది. అదే, 2018-19లో కూడా జీఎస్టీ క్లెయిమ్ చేయలేదు. 14 శాతం కటాప్ కంటే రూ.957 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక (2019-230) సంవత్సరంలో మన ఆదాయం చాలా తగ్గింది. ఆ లెక్కన కేంద్ర నుంచి మనకు రూ.3196కోట్లు రావాలి. కానీ ఇప్పటివరకు రూ.2263 కోట్లు మాత్రమే వాళ్లు ఇచ్చారు. చట్టం ప్రకారం మనకింకా రూ.930 కోట్లు రావాలి. ఈ లెక్కలన్నీ ఫిబ్రవరి వరకే. మార్చి లెక్కలు అదనంగా జతవుతాయి.

అప్పులు నిజమే కానీ..

అప్పులు నిజమే కానీ..

తెలంగాన రాష్ట్రం అప్పులు చేస్తున్న మాట వాస్తవం. అయితే ఎఫ్ఆర్బీఎం పరిధి, నిబంధనల ప్రకారమే అభివృద్ధి పనుల కోసం రుణాలు తీసుకుంటున్నాం తప్ప, అడ్డగోలుగా కానేకాదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సయంగా వెల్లడించింది. మొన్న ఫిబ్రవరిలో పార్లమెంటులో దీనిపై ఒక వివరణ వెలువడింది. ఆర్థిక క్రమశిక్షణలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకంటే ముందుందని కేంద్రమే కితాబిచ్చింది'' అని మంత్రి హరీశ్ రావు వివరించారు. ఇక శాఖల కేటాయింపు వివరాల్లోకి వెళితే..

బడ్జెట్ స్వరూపం..

బడ్జెట్ స్వరూపం..


2020-21 మొత్తం బడ్జెట్ : 1,82,914.42 కోట్లు
రెవెన్యూ వ్యయం : 1, 38, 669.82 కోట్లు
క్యాపిటల్ వ్యయం : 22,061.18 కోట్లు
రెవెన్యూ మిగులు : 4,482.12 కోట్లు
ఆర్థిక లోటు : 33,191.25 కోట్లు

కీలక శాఖలకు కేటాయింపులిలా..

కీలక శాఖలకు కేటాయింపులిలా..

పంచాయతీరాజ్‌ అభివృద్ధికి రూ.23,500 కోట్లు
ఎస్సీ ప్రత్యేక నిధికి రూ. 16534.97 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ. 1518.06కోట్లు
మున్సిపల్‌శాఖకు రూ. 14,809 కోట్లు
రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు
గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు
అన్ని రకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు
సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు
పాఠశాల విద్య కోసం రూ. 10,421 కోట్లు
విద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు కేటాయింపు
హైదరాబాద్ అర్బన్ అగ్లామిరేషన్ కు రూ.10వేల కోట్లు
మూసీ రివర్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.10 వేల కోట్లు
ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 9771.27 కోట్లు
వైద్యరంగానికి రూ. 6,186 కోట్లు
పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు
వెనుకబడిన వర్గాల కోసం రూ. 4,356.82 కోట్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.2,650 కోట్లు
పారిశ్రామిక అభివృద్ధికి రూ.1,998 కోట్లు
ఉన్నత విద్య కోసం రూ.1,723 కోట్లు
మత్స్యకారుల సంక్షేమానికి రూ.1586 కోట్లు
మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1200 కోట్లు
మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌కు రూ.1000 కోట్లు
ఆర్టీసీకి రూ.1000 కోట్లు
హరితహారం కోసం రూ. 791 కోట్లు
చిన్న నీటిపారుదలశాఖకు రూ.600 కోట్లు
ఎంబీసీల సంక్షేమానికి రూ.500 కోట్లు
పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణానికి రూ. 550 కోట్లు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధికి రూ.480 కోట్లు
ఆర్‌అండ్‌బీ కోసం రూ. 3,494 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కోసం రూ. 350 కోట్లు
రైతు వేదిక నిర్మాణానికి రూ.300 కోట్లు
విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు
పాడి రైతుల ప్రోత్సాహకం కోసం రూ.100 కోట్లు
సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ.100 కోట్లు
దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం రూ.50 కోట్లు

English summary
about five new initiatives has been introduced in telangana budget 2020-21. after presenting his budget, finance minister told media about the new initiatives
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X