telangana budget 2022: తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్; "ఆర్ఆర్ఆర్" సస్పెన్షన్ రీజన్ ఇదే!!
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు శాసనసభ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న క్రమంలో తెలంగాణ శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. హరీష్ రావ్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన బిజెపి సభ్యులపై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Recommended Video
దీంతో బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ లను సస్పెండ్ చేస్తున్నట్లు గా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సభ ముగిసే వరకు ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. బడ్జెట్ సెషన్ మొత్తానికి ముగ్గురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీనిపై బిజెపి ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని తమను సభలో మాట్లాడకుండా చేస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వీరిని సభలో నుండి మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్లారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు.

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా గొంతుకను వినిపించాలని ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం పై అంతకుముందు గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు సభలో రాష్ట్రంలోని ప్రజల సమస్యలను ప్రస్తావిస్తామని, సీఎం కేసీఆర్ తీరును ఎండగడతామని వెల్లడించారు. కానీ శాసనసభ సమావేశాల తొలిరోజే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సెషన్ మొత్తం శాసనసభలో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయారు.












Click it and Unblock the Notifications