Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతిపక్షాలు లేకుండా 2గంటల పాటు బడ్జెట్ ప్రసంగం: కేంద్రంపై హరీష్ నిప్పులు; బుధవారానికి సభ వాయిదా

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలిరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మంత్రి హరీష్ రావు 2022- 23 సంవత్సరానికిగానూ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,56,958. 51 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు.

రెండు గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగం

రెండు గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగం

రాష్ట్రంలో వివిధ వర్గాల వారికి మేలు చేకూర్చే అనేక పథకాలతో బడ్జెట్ కేటాయింపులు చేసి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రెండు గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ రంగానికి, విద్య, వైద్యం తో పాటు, రాష్ట్రంలోని వివిధ పథకాల కోసం చేసిన కేటాయింపులను మంత్రి హరీష్ రావు చదివి వినిపించారు. సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా మధ్యాహ్నం 1:30 నిమిషాలకు హరీష్ రావు తన ప్రసంగాన్ని ముగించారు.

కేంద్రం పై బడ్జెట్ ప్రసంగంలో హరీష్ నిప్పులు

కేంద్రం పై బడ్జెట్ ప్రసంగంలో హరీష్ నిప్పులు

తొలిరోజు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టి కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేశారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. వెనకబడిన జిల్లాలకు కేంద్ర నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని, సాక్షాత్తు ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ వెళ్లి చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లకు నిధులు ఇవ్వలేదని కేంద్రం తీరు పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదుc

రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ దిక్కులేదని, కాజీపేట రైల్వే జోన్ వ్యవహారంలో వివక్ష చూపుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో దేశ వృద్ధి రేటు మైనస్ లో ఉన్న తెలంగాణ వృద్ధి రేటు రెండు పైగానే ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపిందని మంత్రి హరీష్ రావు కేంద్రం పై నిప్పులు చెరిగారు.

సభను బుధవారానికి వాయిదా వేసిన స్పీకర్ , సభను బాయ్ కాట్ చేసిన కాంగ్రెస్

సభను బుధవారానికి వాయిదా వేసిన స్పీకర్ , సభను బాయ్ కాట్ చేసిన కాంగ్రెస్

అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు గా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు గా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాల్లో నిబంధనలు పాటించకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించిన ప్రభుత్వాన్ని తప్పుపడుతూ, ఏకపక్షంగా సభ నిర్వహించడం వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు శాసనసభ సభ్యులు సమావేశాలను బహిష్కరించారు.

బీజేపీ స్పస్పెన్షన్.. ప్రతిపక్షాలు లేకుండా తొలిరోజు సభ

మరోవైపు శాసనసభ వేదికగా తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడతామని అసెంబ్లీ కి వెళ్లిన బిజెపి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ లను బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారని సస్పెండ్ చేశారు. బిజెపి సభ్యులపై సస్పెన్షన్ తీర్మానాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాదించగా స్పీకర్ ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొత్తం బిజెపి సభ్యులపై సస్పెన్షన్ విధిస్తూ ప్రకటన చేశారు. దీంతో ప్రశ్నించే ప్రతిపక్షాలు లేని సభ తెలంగాణ అసెంబ్లీ తొలి రోజు కొనసాగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+