తెలంగాణా బడ్జెట్ హైలైట్స్.. కేసీఆర్ మార్క్ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట; కేటాయింపులు ఇలా!!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మంత్రి హరీష్ రావు 2022- 23 సంవత్సరానికిగానూ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,56,958. 51 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంలో కేంద్రం తీరుపై మండిపడ్డారు. 2022- 23 కేసీఆర్ మార్క్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 56 వేల కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 1,89, 274 కోట్లుగా ఉన్నట్టుగా పేర్కొన్నారు. క్యాపిటల్ వ్యయం 29, 728 కోట్లని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
Recommended Video

వ్యవసాయ రంగానికి 24, 254 కోట్లు
బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి 24, 254 కోట్లు కేటాయిస్తున్నట్లు గా ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి భారీగా బడ్జెట్ ను కేటాయించామన్న మంత్రి హరీష్ రావు మోటార్లకు మీటర్లు పెట్టబోమని పేర్కొన్నారు . విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోమని స్పష్టం చేశారు . ఒక్క ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు . ఒక్క పథకానికి డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు . రాష్ట్రానికి ఇవ్వాల్సిన డబ్బును సెస్ రూపంలో దోచుకుంటోందని ఆరోపించారు . 27శాతం ఆదాయం కూడా రావట్లేదని అసహనం వ్యక్తం చేశారు .ఇదే సమయంలో పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం గా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

దళిత బంధు పథకానికి 17,700 కోట్లు.. కేటాయింపులు ఇలా
ఇక ఇదే సమయంలో హరితహారానికి రూ. 932 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఆసరా పెన్షన్ లకు 11,728 కోట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 2,750 కోట్లు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 12 వేల కోట్లు, దళిత బంధు పథకానికి 17,700 కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్లు, మన ఊరు మన బడి 7,289 కోట్లు, పట్టణ ప్రగతి కోసం 1,394 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 5,698 కోట్లు, పల్లె ప్రగతి కోసం 3,330 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం 177 కోట్లు, రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ కోసం 100 కోట్లు, రోడ్లు భవనాల కోసం 1,542 కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.

నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు, సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం
సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనున్నట్టు వెల్లడించారు. సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలనే ఆలోచనతో తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందుకోసం గాను 100 కోట్ల రూపాయలు కేటాయించారు.

అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు .. 60 బస్తీ దవాఖానాలు
రాష్ట్ర ప్రజలకు బడ్జెట్ లో రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ లోని బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో 60 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని ప్రకటించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications