Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Telangana Budget 2022: రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు; వైద్యరంగానికి భారీగా కేటాయింపులు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో తొలిరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మంత్రి హరీష్ రావు 2022- 23 సంవత్సరానికిగానూ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,56,958. 51 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు వైద్య రంగానికి పెద్దపీట వేస్తునట్లుగా వెల్లడించారు.

రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు

రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు


రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సంవత్సరం కొత్తగా 8 వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన వెల్లడించారు. ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కళాశాలలను ఈ ఏడాది ఏర్పాటుచేయనున్నట్లు గా మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 2023 సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా 8 జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల్, యాదాద్రి జిల్లాలలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. నూతన మెడికల్ కళాశాల స్థాపన కోసం ఈ బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల డైట్ చార్జీల పెంపు

ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల డైట్ చార్జీల పెంపు


ఇక ఇదే సమయంలో ప్రభుత్వాసుపత్రిలో రోగులకు చికిత్స తో పాటు పోషక ఆహారాన్ని అందించాలని, దీనికోసం డైట్ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీష్ రావు తెలిపారు. టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వడం కోసం బెడ్ ఒక్కింటికి ఇచ్చే డైట్ చార్జీలను యాభై ఆరు రూపాయల నుంచి 112 రూపాయలకు పెంచాలని, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కింటికి 40 రూపాయల నుంచి 80 రూపాయలకు పెంచాలని ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం ఏటా 43.5 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు హరీష్ రావు వెల్లడించారు.

రోగితో ఉండే సహాయకులకు సబ్సిడీపై భోజనం; మార్చురీల ఆధునికీకరణ

రోగితో ఉండే సహాయకులకు సబ్సిడీపై భోజనం; మార్చురీల ఆధునికీకరణ


అంతేకాదు హైదరాబాద్ లోని 18 మేజర్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. రెండు పూటల వారికి భోజనం అందుతుందని, ప్రతిరోజు సుమారు 18 వేల 600 మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా వేసినట్లుగా చెప్పారు. దీని కోసం సంవత్సరానికి 38.6 26 కోట్లు ఖర్చు అవుతాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 61 మార్చురీ ల ఆధునికీకరణకు 32 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

ఆస్పత్రుల్లో పని చేసే పారిశుధ్య సిబ్బందికి వేతనాల పెంపు

ఆస్పత్రుల్లో పని చేసే పారిశుధ్య సిబ్బందికి వేతనాల పెంపు


ఇక ఇదే సమయంలో ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని హరీష్ రావు తెలిపారు. ఈమేరకు బడ్జెట్లో ప్రభుత్వం బెడ్ ఒక్కింటికి చేసే పారిశుద్ధ్య ఖర్చును ఐదు వేల రూపాయల నుంచి 7500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రభుత్వం 338 కోట్ల రూపాయలను వెచ్చించి ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖాన లకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 60 బస్తీ దవాఖానాలు

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 60 బస్తీ దవాఖానాలు


రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలను కొత్తగా ప్రారంభించనుంది అని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. బస్తీ దవాఖానాలు అందిస్తున్న సేవలను గుర్తించిన 15 వ ఆర్థిక సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది అని పేర్కొన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హరీష్ రావు వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఈ కేంద్రాలలో 50 ఏళ్లకు పైగా పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఆ మేరకు ఆసుపత్రిలో వైద్య సదుపాయాల కల్పన జరుగుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+