Telangana budget 2024: శాఖలవారీగా కేటాయింపులిలా; పూర్తి సారాంశం ఇదే!!
రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2 లక్షల 75 వేల 891 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2 లక్షల 11 వందల 78 కోట్ల రూపాయలు కాగా, 29 వేల 669 కోట్ల రూపాయలను మూలధన వ్యయంగా ప్రతిపాదించారు.
ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2లక్షల 24వేల 625 కోట్ల రూపాయలుగా మొత్తం అంచనా వ్యయాన్ని సవరించినట్లు ప్రకటించారు. ఈ మేరకు 9వేల 31కోట్ల రూపాయలను రెవెన్యూ ఖాతాలో మిగులు గాను పేర్కొన్న ఆర్థిక మంత్రి 33వేల 786కోట్ల రూపాయలను ద్రవ్యలోటుగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతామన్నారు.

దుబారా వ్యయాన్ని తమ ప్రభుత్వం గణనీయంగా తగ్గిస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వ విధానాలు ఉంటాయని, ఆ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. వాస్తవ రాబడులను అంచనా వేసి అందుకు అనుగుణాంగానే పథకాలకు చిత్తశుద్దితో కేటాయింపులు చేసినట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని హామి ఇచ్చారు. ఇందుకోసం 1 కోటి 29 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేసిన అనంతరం ఆర్టిసీకి అవసరమైన నిధులను అదనంగా మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, యువ వికాసం వంటి హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు.
ఈ పథకాల అమలుకు బడ్జెట్ లో 53 వేల 196 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఈ కేటాయింపు ప్రాథమిక అంచనా అని అవసరమైన పూర్తి నిధులను తిరిగి కేటాయిస్తామని చెప్పారు. పారిశ్రామిక రంగానికి 2 వేల 543 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని మంత్రి ప్రతిపాదించారు.ఐటి సేవల రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను తగిన రీతిలో వినియోగించుకుంటామని చెబుతూ 774 కోట్ల రూపాయలను కేటాయించారు.
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృధి శాఖకు 40వేల 80కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా మూసీ ప్రక్షాళలను చేపట్టి పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్ గా మార్చనున్నట్లు ఇందుకు వెయ్యి కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి వుందని రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ప్రభుత్వం భావిస్తోందని చెబుతూ పురపాలక శాఖ కు 11వేల 692కోట్ల రూపాయలను ప్రతిపాదించారు.

వ్యవసాయ రంగానికి 19వేల 746కోట్ల రూపాయలను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, గురుకులాల భవన నిర్మాణాలకు 1వెయ్యి 250కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు, ఎస్సీ సంక్షేమానికి 21వేల 874కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమానికి 13వేల 313కోట్ల రూపాయలను, మైనారిటి సంక్షేమానికి 2వేల 262కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. బిసి సంక్షేమానికి 8వేల కోట్ల రూపాయలను కేటాయించిన మంత్రి ఇందులో 15వందల 46కోట్ల రూపాయలను గురుకులాల సొంత భవనాలకు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.
విద్యారంగంలో ప్రయోగాత్మకంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు 5 వందల కోట్లు రూపాయలు సహా విద్యారంగానికి 21 వేల 389 కోట్ల రూపాయలను కేటాయించారు. విశ్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 5 వందల కోట్ల రూపాయలను కేటాయించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిధిని 10 లక్షల రూపాయల ఉచిత వైద్యానికి విస్తరించినట్లు వైద్య రంగానికి 11 వేల 5 వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు ఈ బడ్జెట్ లో 2 వేల 418 కోట్ల రూపాయలను ప్రతిపాదలను కేటాయించినట్లు మొత్తంగా 16 వేల 825 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి 7 వేల 740 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు.
నీటిపారుదల శాఖకు 28 వేల 24 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఎగువ ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి తీరుతామని చెప్పారు.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications