ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామికి పూజలు, అసెంబ్లీకి హరీష్ రావు; ఆయనకిది మూడో బడ్జెట్‌!!

తెలంగాణా రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. మరికాసేపట్లో మంత్రి హరీష్ రావు 2022-2023 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభ సమావేశాల తొలిరోజే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

వెంకటేశ్వర స్వామి ఆలయంలో బడ్జెట్ కు హరీష్ రావు పూజలు

వెంకటేశ్వర స్వామి ఆలయంలో బడ్జెట్ కు హరీష్ రావు పూజలు

రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా మంత్రి హరీష్ రావు ఫిలింనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ప్రతి ఏడాది ఫిలింనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. హ‌రీశ్‌రావుతో పాటు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి బయలుదేరారు.

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుంది: హరీష్ రావు

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుంది: హరీష్ రావు

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నానని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా బడ్జెట్ కు రూపకల్పన చేశామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో పెద్ద పీట వేశామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

ఆర్ధిక మంత్రిగా హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టటం మూడో సారి

ఆర్ధిక మంత్రిగా హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టటం మూడో సారి


తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019- 2020 లో సీఎం కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇక ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా హరీష్ రావు 2020-21, 2021- 22 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మూడోసారి 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెడుతున్నారు. ఆర్ధిక శాఖా మంత్రిగా హరీష్ రావు ప్రవేశ పెడుతున్న మూడో బడ్జెట్ ఇది.

Recommended Video

    Telangana Budget Sessions: KCRపై ఎటాక్.. ఈటెల ని ఆయుధంగా చేసుకోబోతున్న BJP | Oneindia Telugu
     బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో భారీ బందోబస్తు

    బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో భారీ బందోబస్తు

    ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. బందోబస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+