వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 వరకు .. 18 న బడ్జెట్ : బీఏసీ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి. 18వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు . ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు . కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష ..మార్చిలో వార్షిక బడ్జెట్అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష ..మార్చిలో వార్షిక బడ్జెట్

 కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ తెలంగాణా బడ్జెట్ సమావేశాలు

కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ తెలంగాణా బడ్జెట్ సమావేశాలు

ఒక వరుసలో ఒక్కరే కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేసి సమావేశాలను నిర్వహించనున్నారు. అసెంబ్లీలో అదనంగా 40 సీట్లను, కౌన్సిల్ లో ఆరు అదనపు సీట్లను ఏర్పాటు చేశారు. కరోనా కేసులు మరోమారు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు మీడియాపై సైతం ఆంక్షలు విధించారు. ఇదిలా ఉంటే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంది.

పది రోజుల పాటు సాగనున్న సమావేశాలు

పది రోజుల పాటు సాగనున్న సమావేశాలు

అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రేపు దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్యకు ఉభయసభలలో సంతాపం తెలుపనున్నారు.

ఈనెల 18 న బడ్జెట్ , బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి

ఈనెల 18 న బడ్జెట్ , బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి

17వ తేదీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది , దానిపై సమాధానం కూడా ఉంటుంది . 18వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు . ఇక 2021-2022 బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అన్న ఉత్కంఠ ప్రతిఒక్కరిలో కనిపిస్తుంది. మార్చి 19 ,21 వ తేదీ లను సెలవులుగా ప్రకటించారు. 20 , 22 తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది . 23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దుల పై చర్చ జరగనుంది . 26న ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో వ్యవసాయ చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కోరింది.

English summary
Minister Vemula Prashanth Reddy, Finance Minister Harish Rao and other opposition party leaders were present at the meeting of the Legislative Affairs Committee chaired by Speaker Pocharam Srinivas Reddy at the Assembly premises. The BAC meeting decided to hold the budget meetings of the Telangana State Assembly for ten days till the 26th of this month. As part of that, the budget will be introduced on the 18th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X