Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: అస్త్ర,శస్త్రాలతో సభాపర్వానికి రెడీ; తొలిసారి సభకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈటల!!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజే ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో ఎన్ని పని దినాలు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబడతాయి అనేది స్పష్టత రానుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ధీటైన అయిన బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రతిపక్షాలను కట్టడి చేయాలని అధికార పార్టీ భావిస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ శాసనసభ సమావేశాల సందర్భంగా ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

తెలంగాణాలో రాజకీయ వేడిని పెంచనున్న సభాపర్వం

తెలంగాణాలో రాజకీయ వేడిని పెంచనున్న సభాపర్వం


గవర్నర్ తమిళి సై ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాల వివాదం, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర కు సంబంధించిన వివాదం, రాష్ట్రంలోని రైతాంగ సమస్యలు, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారిన జీవో 317 వంటి అంశాలను అస్త్రాలుగా మార్చుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ప్రతిపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాలపై అధికార పార్టీ ని టార్గెట్ చేస్తాయని భావించిన తెలంగాణ సర్కార్ ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పడానికి ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి జరగనున్న సభాపర్వం రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచుతుంది అన్న భావన కలుగుతుంది.

తొలిరోజే బడ్జెట్ సమర్పణ

తొలిరోజే బడ్జెట్ సమర్పణ

ఇదిలా ఉంటే సోమవారం నుండి ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు జరగనున్న ట్లుగా సమాచారం. మొదటి రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై స్పష్టత ఇస్తారు. ఇప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం స్పీకర్ అమీనుల్ జాఫ్రీ సమీక్ష నిర్వహించి ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కరోనా మహమ్మారి కేసులు తగ్గినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయాలని సూచించారు .

శాసనసభా సమావేశాల్లో బీజేపీ వ్యూహం ఇదే

శాసనసభా సమావేశాల్లో బీజేపీ వ్యూహం ఇదే

ఇదిలా ఉంటే శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రతిపక్ష పార్టీలు కూడా రెడీ అయ్యాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారంలో బిజెపి నేతల పై వచ్చిన ఆరోపణలను సభా వేదికగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, 3017 జీవోతో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు తలెత్తుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్య, కొత్త పింఛన్లు వ్యవహారాలపై అధికార పార్టీని గట్టిగా ప్రశ్నించాలని నిర్ణయించారు.

తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా శాసనసభకు ఈటల.. సర్వత్రా ఆసక్తి

తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా శాసనసభకు ఈటల.. సర్వత్రా ఆసక్తి

హుజురాబాద్ నుంచి బిజెపి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈటల రాజేందర్ బిజెపి ఎమ్మెల్యే గా తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. గతంలో అధికారపార్టీ పక్షాన మంత్రిగా పనిచేసిన ఈటల ఇప్పుడు ప్రతిపక్షంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప్రశ్నాస్త్రాలను సంధించనున్నారు. ఈటల ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా సభలో టీఆర్ఎస్ ను ఏ విధంగా టార్గెట్ చేస్తారు అనేది ఆసక్తికర అంశం.

Recommended Video

    Telangana Budget Sessions: KCRపై ఎటాక్.. ఈటెల ని ఆయుధంగా చేసుకోబోతున్న BJP | Oneindia Telugu
    సభలో వ్యూహాలపై కాంగ్రెస్ రెడీ .. రైతన్నల సమస్యలపై కాంగ్రెస్ ఫోకస్

    సభలో వ్యూహాలపై కాంగ్రెస్ రెడీ .. రైతన్నల సమస్యలపై కాంగ్రెస్ ఫోకస్

    ఇదే సమయంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ కూడా రంగం సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రైతు సమస్యలపై ఫోకస్ చేస్తూ అధికార పార్టీ ని టార్గెట్ చేయనుంది. అంతేకాకుండా పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం గురించి కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై సభలో సందర్భాన్ని బట్టి అధికార పార్టీని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+