Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా ప్రజలకు బడ్జెట్ భారీ షాక్ ఇవ్వనుందా?

తెలంగాణ శాసనసభలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో పేర్కొన్న కొన్ని అంశాలు అనేక అనుమానాలకు కారణంగా మారాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని రహదారులను హైబ్రిడ్ అన్యుటి మోడల్ ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఈ మోడల్ లో 40 శాతం ప్రభుత్వ నిధులు 60 శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడి ఉంటుంది.

హైబ్రిడ్ అన్యుటి మోడల్ లో రహదారుల అభివృద్ధి
ఈ పెట్టుబడి ద్వారా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. 2028 వరకు హైబ్రిడ్ అన్యుటి మోడల్ లో 17000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను సుమారు 28,000 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి 3725.22 కోట్ల మీద పరిపాలన అనుమతులను కూడా జారీ చేసింది.

Telangana budget shock rural roads development plan with Hybrid Annuity Model

గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం
వీటిలో ఇప్పటివరకు 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు 9 వంతెనల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేసేందుకు వీలుగా ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండేలాగా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టినట్టుగా భట్టి విక్రమార్క తెలిపారు. అయితే భట్టి విక్రమార్క చేసిన ఈ ప్రకటన పైన అనేక అనుమానాలు కచ్చితంగా కలుగుతాయి.

ప్రైవేటు డెవలపర్లకు చెల్లింపుల అంశంపై చర్చ
ప్రైవేట్ డెవలపర్ల భాగస్వామ్యం అని మెన్షన్ చేసినప్పుడు తిరిగి ఆ ప్రైవేటు డెవలపర్లకు చెల్లింపుల అంశం ఆ రహదారుల మీద ప్రయాణం చేసిన వారిపైనే భారంగా మారుతుంది. కచ్చితంగా చెప్పాలంటే జాతీయ రహదారులకు ఏ విధంగా అయితే టోల్ వసూలు చేస్తారో అదే విధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ విధానంలో టోల్ వసూలు చేసే అవకాశం ఉంటుంది అన్న అనుమానాలు పెద్ద ఎత్తున కలుగుతున్నాయి.

ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి
ఈ క్రమంలోనే హైబ్రిడ్ అన్యుటి మోడల్ లో రహదారులను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేది, ప్రైవేట్ డెవలపర్లను భాగస్వామ్యం చేసినప్పుడు ఆ భారం ఎవరి మీద పడుతుంది అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+