తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
తెలంగాణ కేబినెట్ సమావేశం మేడారంలో జరిగింది. చరిత్రలో మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ బయట కేబినెట్ సమావేశం జరగడం విశేషం. మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఈ సమావేశాన్ని మేడారంలో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే జిల్లాల పునర్విభజనకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
అతిపెద్ద ఆదివాసీ పండగ మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ కేబినెట్ సమావేశం మేడారంలో జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
అలాగే స్థానిక సంస్థల ద్వారా పాలనను మరింత చేరువ చేయాలని, పెండింగ్ లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లాల సరిహద్దులను మార్చాలని నిర్ణయించింది.

మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం జరిగిన ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రివర్గ సహచరులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, జాతరకు వచ్చే లక్షలాది భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. జాతరకు సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్ లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగాన్ని పర్యవేక్షించారు. అలాగే భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, AI సాంకేతిక పరిజ్ఞానంతో వాటి పనితీరును పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.












Click it and Unblock the Notifications