తెలంగాణ కేబినెట్ భేటీ 9న: పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
మార్చి 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
హైదరాబాద్: మార్చి 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవలే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరిన్ని కీలక అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఈ కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సొంత ఇళ్ల స్థలాలు ఉండి.. ఇళ్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి విధి విధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.

ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపైనా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపైనా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇతర కీలక పథకాలపైనా చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications