యూపీఎస్సీ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ అభ్యర్థులు వీరే
యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.
సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది ఆగస్ట్ 26న ముఖ్యమంత్రి ఎరేవంత్ రెడ్డి వీరికి చెక్కులు పంపిణీ చేశారు.

రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 20 మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లోనూ విజేతలుగా నిలిచారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఈ. సాయి శివాని, రాహుల్ శంకేషి, పోతరాజు హరి ప్రసాద్, విక్రమ్ బేతి, ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల సాయికుమార్ , బానోతు నాగ రాజా నాయక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన కడారి శ్రీవాణి, గాదె శ్వేత, రాపర్తి ప్రీతి, మెదక్ జిల్లాకు చెందిన కుమ్మరి శ్రవణ్ కుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మొహమ్మద్ అశ్ఫాక్, తొగరు సూర్యతేజ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బెస్త ప్రియాంజలి, సిద్ధిపేటకు చెందిన నరిగె స్వామి, నాగర్‌కర్నూలుకు చెందిన గోకమల్ల అంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన ఆర్. ప్రమోద్ కుమార్, వికారాబాద్‌కు చెందిన బి. ప్రహ్లాద్, జగిత్యాలకు చెందిన బురుగుపెల్లి నీరజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన జస్వంత్ కుమార్, అసిఫాబాద్-కుమ్రంభీం జిల్లాకు చెందిన రామ్టెంకి సుధాకర్ మెయిన్స్ క్వాలిఫై అయిన జాబితాలో ఉన్నారు.
తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రజా ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వారిలో 20 మంది అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications