Telangana: పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షా సమయాల్లో మార్పు

Telangana: రంజాన్ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పదోతరగతి ప్రీ-ఫైనల్ పరీక్షా సమయాలను మార్చింది. గతం పరీక్షా సమయం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఉండేది. దానిని ఇప్పుడు ఒక గంట మార్చారు. సోమవారం జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు మధ్యాహ్నం 12.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఉంటాయి. భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం పరీక్షలను గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు.

అంటే ఈ పరీక్షలు మధ్యాహ్నం 1.45 గంటలకు ముగుస్తాయి. సమయం మార్పు దృష్ట్యా మధ్యాహ్నం 12.15 గంటలలోపే పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించబడుతుంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభమై.. మార్చి 15వ తేదీన ముగియనున్నాయి. ఈ ప్రీ-ఫైనల్ పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు టైమ్ టేబుల్ ను గతంలోనే విడుదల చేసింది.

Telangana Changes Schedule for 10th Class Pre-Final Exams During Ramadan

పదో తరగతి ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్
మార్చి 6- ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 7 -సెకండ్ లాంగ్వేజ్
మార్చి 10 - ఆంగ్లము
మార్చి 11 - గణితం
మార్చి 12 - భౌతిక శాస్త్రం
మార్చి 13- జీవ శాస్త్రం
మార్చి 15 - సోషల్ స్టడీస్

పదో తరగతి ఫైనల్ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..
మార్చి 21- ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24- ఆంగ్లము
మార్చి 26-గణితం
మార్చి 28 - భౌతిక శాస్త్రం
మార్చి 29 - జీవ శాస్త్రం
ఏప్రిల్ 2 -సోషల్ స్టడీస్
ఏప్రిల్ 3-పేపర్-1 లాంగ్వేజ్ పరీక్ష(ఒకేషనల్ కోర్సు)
ఏప్రిల్ 4 - పేపర్-2 లాంగ్వేజ్ పరీక్ష(ఒకేషనల్ కోర్సు)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+