వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి - ప్రభుత్వం సూచన..!!

ఇంకా వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు వంట గ్యాస్ సరఫరాలో సమస్య లేదని చెబుతున్నా.. పంపిణీలో మాత్రం వినియోగదారులకు కష్టాలు తప్పటం లేదు. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీల్లో ఒక్కో సంస్థ ఒక్కో విధంగా పంపిణీ చేస్తోంది. బుకింగ్ కు లాకింగ్ పిరీయడ్ అమలు ద్వారా బుకింగ్స్ నియంత్రణ చేస్తున్నా.. ఆ మేర సరఫరా మెరుగు కావటం లేదు. దీంతో, పలు ప్రాంతాల్లో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా, గ్యాస్ కోసం వేచి చేస్తున్న వారి వివరాలు.. సరఫరా పై అధికారులు స్పష్టత ఇచ్చారు.

వంట గ్యాస్ సమస్య లేదని చెబుతున్నా.. ప్రస్తుతం రాష్ట్రంలో 15లక్షలపైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది. వీటి సరఫరాకు వారంపైనే పట్టే అవకాశం కనిపిస్తోంది. సిలిండర్ కోసం బుకింగ్ చేసిన తరువాత వినియోగదారుడి ఇంటికి సిలిండర్‌ చేరడానికి తక్కువలో తక్కువగా రెండు నుంచి మూడు వారాలు పడుతోంది. డోర్‌ డెలివరీ ఆలస్యం అవుతుండటంతో వినియోగదారులు ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.30 కోట్ల గృహ వినియోగ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల రోజువారీ బుకింగ్‌లు ఉంటాయి. రోజుకు ఐవోసీఎల్‌ 93 వేలు, హెచ్‌పీసీఎల్‌ 75 వేలు, బీపీసీఎల్‌ 47 వేల చొప్పున గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తుంటాయి. యుద్ధం ప్రారంభం కాకముందు సాధారణ రోజుల్లో రాష్ట్రంలో రోజూ వారీగా 3.50 లక్షల పెండింగ్‌ బిల్లులు(బుకింగ్‌) ఉండేవి. అందులో 2.15 లక్షల సిలిండర్లు సరఫరా చేసేవారు. మిగిలినవి మరుసటి రోజున డెలివరీ చేసేవారు. కానీ, ఇప్పుడు పెండింగ్‌ బుకింగ్‌ల సంఖ్య 15 లక్షలకు పెరిగింది.

telangana-civil-supplies-launched-a-toll-free-helpline-1967-to-address-public-complaints-related-to

ప్రభుత్వం నిరంతర నిఘా.. పర్యవేక్షణ

ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న వారికి సిలిండర్ డెలివరీ కావడానికి 7-8 రోజుల సమయం పడుతుంది. ఆలోపు కొత్త బుకింగ్‌ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో, ప్రభుత్వం గ్యాస్ సరఫరా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. గ్యాస్ డెలివరీలో జాప్యం జరిగితే వినియోగదారులు ప్రభుత్వం కేటాయించిన 1967 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ నంబర్ ద్వారా పౌరసరఫరాల శాఖకు నేరుగా సమాచారం అందు తుంది. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా గ్యాస్ సరఫరాలో ఆలస్యంతో పాటుగా డెలివరీ బాయ్స్ నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసినా, సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చినా పౌరసరఫరాల శాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు తమ వద్ద ఉన్న నిల్వలు, బుకింగ్ వివరాలను పారదర్శకంగా ఉంచాలని అధికారులు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+