కాసేపట్లో గవర్నర్ తో కాంగ్రెస్ భేటీ-రేపు సీఎల్పీ మీటింగ్-తర్వాతే ప్రమాణస్వీకారంపై..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 119 సీట్లున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 60 సీట్లు సాధించింది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక కోసం సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ఘన విజయం అందించిన రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు డిప్యూటీగా మధిర ఎమ్మెల్యే, సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం ఉంటుందని సమాచారం.

ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ రేపు కీలక భేటీ నిర్వహించబోతోంది. ఇవాళ సాయంత్రమే సీఎల్పీ భేటీ జరుగుతుందని, రేపు సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని భావించినా అలా జరగలేదు. దీంతో రేపు ఉదయం 9.30 గంటకు సీఎల్పీ భేటీ వాయిదా పడింది. ఈ విషయాన్ని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధికారికంగా ప్రకటించారు. ఈ భేటీలో కొత్త గూడెంలో గెలిచిన సీపీఐ ఎమ్మెల్యేను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

telangana clp leader selection meeting tomorrow, congress leaders to meet governor tonight

అలాగే సీఎల్పీ భేటీలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. అధిష్టానం నుంచి వచ్చే సూచనల ఆధారంగా సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటారు. దీంతో రేపటి భేటీలో సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తారా లేక దళిత ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం కల్పిస్తారా అన్న దానిపై ఉత్కంఠ సాగుతోంది. ఇదే భేటీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, కేబినెట్ విస్తరణ ఎప్పుడు అన్నది నిర్ణయం తీసుకుంటారు.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ రాత్రికి గవర్నర్ తమిళి సైని రాజ్ భవన్ లో కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరే అవకాశముంది. అనంతరం మెజార్టీని పరిగణనలోకి తీసుకుని గవర్నర్ తన నిర్ణయం ప్రకటిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+