గద్దర్ మరణంపై కేసీఆర్ దిగ్భ్రాంతి: తెలంగాణ అసెంబ్లీలో సంతాపం
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన గద్దర్ మరణం తీరని లోటని అన్నారు.
తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గద్దర్ ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలకోసం తన జీవితాన్ని అంకితం చేసి ప్రజలకోసమే బతికాడని, గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ గొప్ప ప్రజా కవిని కోల్పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సాధారణ బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమైన గద్దర్ కళాజీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నతస్థాయికి చేరిందన్నారు కేసీఆర్.
కవిగా గద్దర్ ప్రజా కళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని సీఎం అన్నారు. ప్రజా కళాకారులకు కవులకు మరణం వుండదనీ, ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని సీఎం తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సీఎం కేసీఆర్.
మరోవైపు, ప్రజాయుద్ధనౌక గద్దర్ మృతి పట్ల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. తన పాటలతో కోట్లాది మంది హృదయాలను ఉత్తేజపరిచిన గద్దర్ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు.

గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జన నాట్యమండలి స్థాపించి జనం కోసం గొంతెత్తి, పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాగాయకుడని పేర్కొన్నారు. ప్రజాయుద్ధనౌక గద్దర్ నిష్క్రమణ తీరని లోటని అన్నారు. భౌతికంగా దూరమైనా గద్దర్ జ్ఞాపకాలు పాటల రూపంలో నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని వెల్లడించారు. 'పోరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా' జోహర్ గద్దర్ అంటూ పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సంతాపం
ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన మహాకళాకారుడు గద్దర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ గద్దర్‌కు నివాళులర్పించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి తీసుకువచ్చిన ప్రజావాగ్గేయ కారుడు గద్దర్ ప్రసిద్ధి చెందిన గుమ్మడి విఠల్ అని కొనియాడారు. యావత్ తెలంగాణ ప్రజలకు దిగ్భ్రాంతి, దుఃఖాన్ని కలిగించిన వార్త అన్న అన్నారు. ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచి.. విప్లవ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించి.. ఎన్నో సందర్భాల్లో ప్రజలను ఊర్రూతలూగించిన అద్భుతమైన గాయకుడు గద్దర్ అని ప్రశంసించారు.
ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దన మహాకళాకారుడని, ఆయన లేని లోటు తీర్చలేనిది. పూడ్చలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన వేదికను పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. ఎన్నో సందర్భాల్లో ఉత్సాహాన్ని నింపిన అద్భుతమైన కళాకారుడని, ఆయన లేకపోవడం బాధాకరమన్నారు. శాసనసభ, ప్రభుత్వం తరఫున సంతాపం ప్రకటించారు. ప్రజాకళలు వర్ధిల్లినంత కాలం, జానపదం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందన్నారు. ఆయన కుటుంబానికి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామన్నారు. కుటుంబంతో పాటు ఆయన మిత్రులకు మనోధైర్యాన్ని, ఆత్మస్థయిర్యం ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు మంత్రి కేటీఆర్. గద్దర్‌కు శాసనసభ నివాళులర్పించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications