• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం... వ్యాపార,ఉపాధి రంగాల్లో దళిత బంధు ద్వారా రిజర్వేషన్లు...

|

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార,ఉపాధి రంగాల్లో అర్హులైన దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. మెడికల్ షాపులు,మీసేవా కేంద్రాలు,గ్యాస్ డీలర్‌షిప్స్,ఫర్టిలైజర్ షాపులు,ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్స్,మైనింగ్ లీజులు,సివిల్ కాంట్రాక్టర్స్,ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్,బార్ షాపులు,వైన్ షాపులు తదితర రంగాల్లో దళితులు ఉపాధి పొందేలా దళిత బంధు ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దళిత బంధు అమలుకు సంబంధించి ప్రగతి భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ మహాశయుడు అంబేడ్కర్ అందించిన ఫలాలు తప్పితే దళితుల జీవితాల్లో ఇప్పటికీ గుణాత్మకమైన మార్పు రాలేదన్నారు. దళితబంధు పథకం... మొదటి దశలో పథకం అమలు పటిష్టంగా జరగాలన్నారు. రెండో దశలో పథకం పర్యవేక్షణ కీలకమని అన్నారు. జిల్లా కలెక్టర్లు, దళితబంధు కమిటీలు దీనికోసం సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి ప్రత్యేక దళితబందు బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

telangana cm kcr another decision in dalith bandhu review meet

దళిత బంధు అమలు,పర్యవేక్షణ కోసం గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు.కమిటీల్లో దళిత బిడ్డలే ఉంటారని... ఆ జాతి అభివృద్ధికి వారినే స్వయంగా భాగాస్వాములను చేయడం ఈ పథకం గొప్పతనమని అన్నారు. ఈ కమిటీల నుంచి ఎన్నిక కాబడిన వారే రీసోర్స్‌ పర్సన్స్‌గా ఉంటారని చెప్పారు. ఆశావహ దృక్పథానికి బాటలు వేస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదని అన్నారు. అగ్రకులాల్లోని పేదల అభివృద్దికి సైతం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఒక్కొక్క రంగాన్ని వర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నరాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చర్యలు చేపడుతోందన్నారు. అందులో భాగంగానే దళితబంధు అమలుకోసం ప్రయోగాత్మకంగా నాలుగు మండలాలను ఎంపిక చేశామన్నారు.దళిత జాతి అభివృద్ధిలో మీరు చాలా గొప్ప పాత్ర పోషించాలని.. పోషిస్తారని ఆశిస్తున్నానంటూ ఆ నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తాజా సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. క్షేత్ర స్థాయిలో దళిత బంధు పథకంపై ఆ వర్గానికి చెందిన ప్రజల అభిప్రాయాలు,మనోభావాలు, అధికార యంత్రాంగం అనుభవాలను కలెక్టర్ సీఎం కేసీఆర్‌కు వివరించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్సీ , ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను సీఎం కేసీఆర్‌ సేకరించారు.

  ప్రశ్నించినందుకే తీన్మార్ మల్లన్నను ప్రభుత్వం జైల్లో పెట్టించిందన్న మాజీ ఎంపి వివేక్

  దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్రంలోని మరో 4 మండలాలను ఈ పథకం కోసం ఎంపిక చేశారు. వీటిలో చింత‌కాని మండ‌లం ( మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం, ఖ‌మ్మం జిల్లా ),తిరుమ‌ల‌గిరి మండ‌లం ( తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం, సూర్యాపేట జిల్లా ),చార‌గొండ మండ‌లం ( అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం, నాగర్‌క‌ర్నూల్ జిల్లా )
  నిజాం సాగ‌ర్ మండ‌లం ( జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం, కామారెడ్డి జిల్లా ) ఉన్నాయి.త్వరలోనే ఈ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలుచేయనున్నారు.

  English summary
  Telangana Chief Minister KCR took another crucial decision. He took a decision that reservations for eligible Dalits in the fields of business. Through Dalit Bandhu will take steps to ensure employment of Dalits in medical shops, service centers, gas dealerships, fertilizer shops, transport permits, mining leases, civil contractors, outsourcing contracts, bar shops, wine shops etc.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X