మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఆర్థిక పరిస్థితిపై కెసిఆర్ ఆరా, నెట్టుకొస్తున్నామని చెప్పిన యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరే సమయంలో హెలిప్యాడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా కెసిఆర్.. యనమలతో ఏపీ ఆర్థిక పరిస్థితి పైన ఆరా తీశారని తెలుస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న నిధులు గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని నెట్టుకు వస్తున్నామని యనమల తెలంగాణ సీఎం కెసిఆర్‌కు చెప్పారు.

కెసీఆర్ - రావెల - యనమల

కెసీఆర్ - రావెల - యనమల

ఉండవల్లిలో హెలిప్యాడ్ దిగిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్వాగతం పలుకుతున్న ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు. పక్కన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.

ఈటెలకు జ్ఞాపిక

ఈటెలకు జ్ఞాపిక

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు సోమవారం నాడు జ్ఞాపిక అందచేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

బాల్క సుమన్‌కు జ్ఞాపిక

బాల్క సుమన్‌కు జ్ఞాపిక

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్‌కు జ్ఞాపిక అందచేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

ఆహ్వాన పత్రిక

ఆహ్వాన పత్రిక

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుకు చండీయాగం ఆహ్వాన పత్రిక ఇస్తున్న దృశ్యం.

సహృద్భావ చర్చలు: రావెల

విశ్వశాంతి కోసం తాను చండీయాగం చేస్తున్నట్లు కెసిఆర్ చెప్పారని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. కెసిఆర్ అమరావతి నుంచి హైదరాబాద్ తిరుగు పయనం అయ్యాక ఆయన విలేకరులతో మాట్లాడారు. చండీయాగం ఆఖరు రోజు అయిన 27వ తారీఖు మంచి రోజు ఉందని, ఆ రోజు రావాలని చెప్పారన్నారు.

అదే రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా వస్తున్నారని కెసిఆర్ చెప్పారన్నారు. ఇరువురు సీఎంల మధ్య సుహృద్భావ చర్చలు జరిగాయన్నారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై ముఖ్యమంత్రులు చర్చించారని చెప్పారు. ప్రత్యేకంగా విభజనకు సంబంధించిన అంశాలు పైన వారు చర్చించలేదన్నారు.

కెసిఆర్ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చారని, అధికారిక సమావేశాల కోసం రాలేదని రావెల చెప్పారు. ఇరు రాష్ట్రాల చరిత్ర, అభివృద్ధిపై వారు చర్చించారన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు కాసేపు ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకున్నారని తెలిపారు.

English summary
Telangana CM KCR asks Yanamala about AP Financial situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X