నా సంగతి మీకు తెలుసు: అసద్‌కు తినిపించిన కేసీఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం నాడు నిజాం కళాశాల మైదానంలో ఇప్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో తప్పబోనని చెప్పారు.
ముస్లీంలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మైనార్టీల రిజర్వేషన్ల కోసం ఇప్టికే ఓ కమిటీని వేశామని, కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తామన్నారు.
ఈ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో కేసీఆర్
పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో సీఎం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందుకు హాజరైన ముస్లిం మత ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నేతలు, ముస్లిం సోదరులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.

ఇఫ్తార్ విందులో కేసీఆర్
రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నేను మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని, ఇది మీ అందరికీ తెలుసునని చెప్పారు.

ఇఫ్తార్ విందులో కేసీఆర్
రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ఆదివారం రాష్ట్రంలోని 200 మసీదుల వద్ద ప్రభుత్వపరంగా దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఏర్పాటు చేశామని, లక్షల సంఖ్యలో ముస్లింలు ఈ విందులో పాల్గొనడం చాలా సంతోషకరం అని చెప్పారు.

ఇఫ్తార్ విందులో కేసీఆర్
దేశంలో మైనారిటీల సంక్షేమానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు కేటాయించిందంటే అది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు.

ఇఫ్తార్ విందులో కేసీఆర్
షాదీ ముబారక్ వంటి పథకాన్ని అమలు చేస్తున్నామని, మరో మంచి మాట ఏమిటంటే.. దేశవ్యాప్తంగా మరెక్కడా లేనివిధంగా మైనారిటీ విద్యార్థుల కోసం రూ.3900 కోట్లతో రాష్ట్రంలో 120 రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పుతున్నట్టు తెలిపారు. ఈ నెల నుంచి 71 స్కూళ్లను ప్రారంభిస్తున్నామన్నారు.

కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడుతున్న కవిత.

కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు హైదరాబాదులో డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తున్న కవిత.












Click it and Unblock the Notifications