హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదం: అమరావతి శిలాఫలకంపై కేసీఆర్ పేరు, ఎమ్మెల్సీ జనార్దన్‌కు చేదు అనుభవం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నవ్వాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కొత్త వివాదం రాజుకుంది. శంకుస్థాపన శిలాఫలకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చేర్చారు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడంపై తాము వ్యతిరేకం కాదని టీడీపీ నేతలు అంటున్నారు.

అయితే రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ పేరును శంకుస్థాపన శిలాఫలకంపై ఎలా చేరుస్తారంటూ టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిని సమర్ధించుకుంది. ప్రొటోకాల్‌ ప్రకారమే కేసీఆర్‌ పేరు చేర్చామని అధికారులు చెబుతున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం శంకుస్థాపన శిలాఫలకంపై గవర్నర్లు, సీఎంల పేర్లను పెట్టడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.

Telangana cm kcr name included in amravati foundation laying ceremony

ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌కు చేదు అనుభవం

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వాన పత్రం ఇచ్చేందుకు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇంటిలోనే ఉన్నప్పటికీ, ఆహ్వాన పత్రికఅందుకోకుండా తన గన్‌మెన్‌కు ఇచ్చి వెళ్లాలని నాదెండ్ల భాస్కర్ సూచించారు.

దీంతో టీడీ జనార్దన్ గన్‌మెన్‌కు ఆహ్వాన పత్రిక ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా నాదెండ్ల భాస్కర్ తీరుపై టీడీపీ వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మాట్లాడుతూ ఏపీ రాజధాని శంకుస్థాపన ఆహ్వానాన్ని తాను తిరస్కరించలేదని వివరణ ఇచ్చారు.

మా ఇంటికి మంత్రి అయ్యన్న వస్తారన్న సమాచారంతో చాలా సేపు ఎదురుచూసినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ జనార్దన్‌ వచ్చి వెళ్లారని తనకు తెలియదని నాదెండ్ల భాస్కర్‌రావు అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రికను అందించిన సంగతి తెలిసిందే.

English summary
Telangana cm kcr name included in amravati foundation laying ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X