• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమ్మా బాగున్నారా.: పంచాయతీ కార్యదర్శి రమాదేవికి సీఎం కేసీఆర్ ఫోన్: వారి సంభాషణ ఇలా..

|

వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవీకి శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామంలో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు తదితర అంశాల గురించి ఆరా తీశారు.

  Telangana Assembly Monsoon Session : Corona Test Must For All MLAs Before Attending The Session
  నేను పన్ను చెల్లించే ఇల్లు కట్టా..

  నేను పన్ను చెల్లించే ఇల్లు కట్టా..

  ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవడం, పన్ను కట్టడం తప్పనిసరి అని, తాను కూడా పన్ను చెల్లించిన తర్వాతే ఇల్లు కట్టానని సీఎం కేసీఆర్ తెలిపారు. కాగా, సీఎం అడిగిన వివరాలను చెప్పినట్లు కార్యదర్శి రమాదేవి తెలిపారు. కాగా, ఏనుగల్.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ స్వగ్రామం. ప్రస్తుతం సీఎం కేసీఆర్, పంచాయతీ కార్యదర్శి సంభాషణ వైరల్‌గా మారింది.

  అమ్మా బాగున్నారా.. అంటూ..

  అమ్మా బాగున్నారా.. అంటూ..

  సీఎం కేసీఆర్‌: నమస్తే అమ్మా బాగున్నారా

  రమాదేవి: నమస్తే సార్‌ బాగున్నం..

  సీఎం: విలేజిలో ఉండే ఇండ్ల రికార్డంతా మన దగ్గర ఉంటదా? దాని బేస్డ్‌గానే మనం ట్యాక్స్‌లు వసూలు చేస్తం.. అంతే కదమ్మా?

  రమాదేవి: ఉంది సార్‌.. ఔను సార్‌

  సీఎం: సపోజ్‌ ఒకాయనకు ఒక ఇల్లు ఉంది.. దాని ఇంకొకాయనకు అమ్ముకున్నడనుకుం దాం.. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నడు.. మ్యుటేషన్‌ ఎవ రు చేస్తరు మీరేనా..

  రమాదేవి: ఆన్‌లైన్‌లో చేసినంక రికార్డులో ఎంట్రీ చేస్తం.

  సీఎం: ఆన్‌లైన్‌లో ఎవరు చేస్తరు?

  రమాదేవి: కంప్యూటర్‌ ఆపరేటర్‌

  సీఎం: కంప్యూటర్‌ ఆపరేటర్‌ మీవాడే కదా..? అథారిటీ అయితే మీరే కదా

  రమాదేవి: ఔను సార్‌

  సీఎం: మీ గ్రామంలో ఎన్ని ఇండ్లున్నయ్‌.. మీకు ఐడియా ఉన్నదా..

  రమాదేవి: 922 సార్‌.. రికార్డులో లేకుండా ఇంకా ఒక యాభై ఉంటయ్‌ కావచ్చు సార్‌

  సీఎం: తతిమావి రికార్డు చెయ్యాలె.. ఇయ్యాళ్ల కాకుంటే రేపు చేస్తం అంతేకదా..

  రమాదేవి: ఔను సార్‌

  సీఎం: వీటి రికార్డు ఎమ్మార్వో ఆఫీస్‌లనో.. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లనో ఉండదు కదా..

  రమాదేవి: ఉండదు సార్‌

  వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటే..

  వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటే..

  సీఎం: ఇంటి ట్యాక్స్‌ వసూలుచేసేది మనమే.. ఆస్తిలో మార్పు జరిగిందనుకోండి.. తండ్రి చనిపోయిండు. ఆ టైమ్‌లో ఇద్దరు కొడుకులు పంచుకున్నరు. ఒకాయనకు వచ్చింది. ఒకాయన ఇంట్లకెళ్లి ఎళ్లిపోయిండనుకుందాం. ఆ ఒకాయన పేరుమీద మార్చేది మనమే కదా. ఇద్దరు అన్నదమ్ములు రాజీఅయి చెప్తే మార్చేది మనమే కదా.

  రమాదేవి: మనమే సార్‌.. వాళ్ల తండ్రి.. నా కొడుకులకు సో అండ్‌ సో భూమి పంచుతున్నట్టు పేపర్‌మీద రాసి తీసుకొచ్చి ఇస్తే ఆన్‌లైన్‌లో సపరేట్ సపరేటుగా మార్పిడి చేస్తాం.

  సీఎం: ప్రతి గ్రామ పంచాయతీలో మీరు చెప్పేదాన్ని బట్టి ప్రాపర్టీ రిజిస్టర్‌ ఉంటది.

  రమాదేవి: సొంత వ్యవసాయభూమిలో ఇల్లు కట్టుకుంటే, దాన్ని రికార్డు చెయ్యలేం కదా సార్‌..

  సీఎం: చెయ్యాలె.. ఎందుకంటే.. నేను ఉన్నకదా అమ్మ.. నా సంగతే చెప్తా.. నా ఫామ్‌ ఉంది. కొడుకుది నాది కలిసి వందెకరాలు ఉంటది. దాంట్ల నేను ఒక ఇల్లు కట్టుకున్న.. నేను ముఖ్యమంత్రిని కదా.. ఇల్లీగల్‌ కట్టుకోవద్దు కదా.. చట్ట ప్రకారం కట్టుకోవాలంటే ఏం చేయాలని అందరినీ అడిగిన.. గింత ఫీజు కడితే నాన్‌ అగ్రికల్చర్‌ కింద కన్వర్ట్‌ చేస్తమని చెప్పిండ్రు. నా ఇల్లు కరెక్టుగా ఎకరంన్నరలో ఉంది. కాంపౌండ్‌ వాల్‌ ఉన్నది.. లోపల ఇల్లు ఉన్నదన్నమాట. దానికి నేను ఫీజు కట్టినిప్పుడు. దాన్ని కన్వర్ట్‌ చేసిండ్రు. అగ్రికల్చర్‌ భూమి నుంచి డిలీట్‌ అయిపోయి, నాన్‌ అగ్రికల్చర్‌ అకౌంట్లకు ఎళ్లిపోయింది. గ్రామ పంచాయతీ పర్మిషన్‌ అవసరం పడ్డది. నాది డీపీవో లెవల్‌కు పోయింది. మా డీపీవో గారు నాకు పర్మిషన్‌ ఇచ్చిండ్రు. నేను కట్టిన ఫీజు మట్టుకు మా గ్రామపంచాయతీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. నా వ్యవసాయభూమి నుంచి ఈ ఒకటిన్నర ఎకరం ఎళ్లిపోయింది. ఇప్పుడు నేను గ్రామపంచాయతీ దాంట్ల వచ్చేశిన. సో కాల్డ్ గ్రామ కంఠంలో లేను.. ఎగ్జాక్ట్‌గా ఎర్రవెల్లి అని గ్రామం అమ్మా..

  మీయాగమప్పుడు నేను వచ్చిన సార్‌

  మీయాగమప్పుడు నేను వచ్చిన సార్‌

  రమాదేవి: మీయాగమప్పుడు నేను వచ్చిన సార్‌.

  సీఎం: ఎందుకొచ్చినవమ్మా.. చూసుడానికి వచ్చినవా..

  రమాదేవి: అవును సార్..

  సీఎం: ఓకే ఓకే..

  సీఎం: ఊరు నుంచి ఎగ్జాక్ట్‌గా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటది. నేను యాగం చేసిన జాగనే మా వ్యవసాయభూమి. అందులోనే నేను ఇల్లు కట్టుకున్న. చట్టం క్లియర్‌గా చెప్పిందేమిటంటే గ్రామం యొక్క జూరిస్‌డిక్షన్‌లో ఎవరు ఎక్కడ ఇల్లు కట్టినా మీ పర్మిషన్‌ కచ్చితంగా తీసుకోవాలె. ట్యాక్స్‌ కూడా పే చేయాలె. అది ఎంతన్నా కానీ.. ఇది చట్టం.. ఆ ప్రకారం నాది గ్రామ కంఠంలో ఉన్నట్టే లెక్కకు వచ్చింది ఇగ. ఇల్లు ఉన్నది కాబట్టి గ్రామం అకౌంట్లకు వచ్చిన. నేను ఇప్పుడు ట్యాక్స్‌ కూడా రెగ్యులర్‌గా పే చేయాలి. ఇదీ చట్టం.. మీ దగ్గర లేనియి ఉంటే వెంటనే దాన్ని రికార్డు చేసెయ్యుండ్రి. కన్వర్ట్‌ కూడా చేసుకొమ్మని చెప్పండి.

  రమాదేవి: చేస్తాం సార్.. చెప్పినం సార్‌..

  సీఎం: రేపు రేపు కానూన్‌ చేంజ్‌ అయితది.. ఇబ్బంది పడుతరని చెప్పి చేపిచ్చండి. వాళ్లకు రక్షణ ఉంటది.. ఇప్పుడు మ్యుటేషన్‌ మీరే చేస్తరు కదా.. రికార్డు మీదగ్గరే ఉంటది.. దాన్నిబట్టే హౌస్‌ట్యాక్స్‌ కూడా కలెక్ట్‌ చేస్తరు. ఇదీ ఎమ్మార్వో దగ్గర ఉండదు. మీది ఆల్రెడీ ఆన్‌లైన్‌ అయ్యింది కదా.. అట్ల అన్ని గ్రామాల్లో ఉందా అమ్మా.. అట్ల

  రమాదేవి: లాస్ట్‌ ఇయర్‌ నుంచి అన్ని గ్రామాలు అప్‌డేట్‌ అవుతున్నయ్‌ సర్‌.. .

  సీఎం: ఆన్‌లైన్‌ అవుతున్నయ్‌ కదా.. ఆన్‌లైన్‌ చెయ్యకపోతె ఇంక నాలుగు రోజుల్లో అయితై.. అంతే కదా.. ఒకే అమ్మా థాంక్యూ..

  రమాదేవి: థాంక్యూ సోమచ్‌ సర్‌..

  సీఎం: రైట్.

  English summary
  telangana CM kcr phone call to a panchayati secretary.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X