హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. దోషులు ఎంతటివారైనా వదిలేది లేదు: సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో డ్రగ్స్ కట్టడిపై ముఖ్యమత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకూడన్నారు. ఈమేరకు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మారద ద్రవ్యాల కేసులలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా వదిలి పెట్టేది లేదని.. కఠినంగా వ్యవహరించాలన్నారు. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపట్టేందుకు ఈ నెల 28వ తేదీన 'స్టేట్ పోలీస్ & ఎక్సైజ్ కాన్ఫరెన్స్'జరపాలని సీఎం నిర్ణయించారు.

డ్రగ్స్ అనే మాట వినపడకూడదు

డ్రగ్స్ అనే మాట వినపడకూడదు

రాష్ట్రంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలన్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం దాదాపు 1000 మందితో కూడిన ప్రత్యేక ‘‘నార్కాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ '' పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డిజిపి ఆధ్వర్యంలో పనిచేయనుంది. డ్రగ్స్ సంబంధిత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేలా విధులను నిర్వర్తించనుంది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించేందుకు చేపట్టాల్సిన కఠిన చర్యలపై ప్రగతి భవన్ లో సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ లతో సీఎం కేసీఆర్ సమీక్షించారు.

స్టేట్ పోలీస్ & ఎక్సైజ్ కాన్ఫరెన్స్ సమావేశం

స్టేట్ పోలీస్ & ఎక్సైజ్ కాన్ఫరెన్స్ సమావేశం

. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న స్టేట్ పోలీస్ & ఎక్సైజ్ కాన్ఫరెన్స్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరుగనున్న ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సీఎస్, డిజిపి, డిజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డిసిపీ అధికారులు వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు.

Recommended Video

డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయడానికి మరో ప్రజా ఉద్యమం రావాలి!!
హైదారాబాద్ లో డ్రగ్స్ మాఫియా

హైదారాబాద్ లో డ్రగ్స్ మాఫియా

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ మేరకు పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇటీవల పలు చోట్ల కొకైన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను భారీ పట్టుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
CM KCR Will review with police officials over action plan on drugs control
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X