పుష్కర స్నానం: మరోసారి 'సమైక్య'పై కేసీఆర్, పక్కనే కాంగ్రెస్ ఎమ్మెల్యే

మహబూబ్ నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహబూబ్ నగర్ జిల్లా గొందిమల్లలో, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని దుర్గా ఘాట్‌లో పవిత్ర కృష్ణా పుష్కర స్నానం ఆచరించారు. ఈ రోజు (శుక్రవారం) నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి.

గొందిమల్లలో కేసీఆర్ తన సతీమణితో కలిసి పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గోదావరి పుష్కరాలు అంటే రాజమహేంద్రవరం, కృష్ణా పుష్కరాలు అంటే విజయవాడ అనేలా సమైక్య పాలకులు చేశారని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాలను కూడాపట్టించుకోలేదన్నారు.

గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆలంపర్‌లో పుష్కర స్నానం మహత్ భాగ్యం అన్నారు. ఆలంపర్ జోగలాంబ ఆళయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు పురావస్తు శాఖతో మాట్లాడుతామని చెప్పారు.

కేసీఆర్ పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్ గొందిమళ్ల పుష్కర ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. అనంతరం జోగులాంబ ఆలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా కేసీఆర్ తన పక్కన కాంగ్రెస్ పార్టీ యువ నేత, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను కూర్చోబెట్టుకున్నారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ పై నిత్యం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంపత్ కుమార్... కేసీఆర్ పక్కన కూర్చోగా, అక్కడే ఉన్న తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు దూరంగా కూర్చున్నారు. అక్కడ వేసిన సోఫాలో కేసీఆర్, సంపత్ కుమార్ డబుల్ సీటు సోఫాలో పక్కపక్కగా కూర్చోగా దానికి కాస్తంత దూరంగా వేసిన ఇతర సోఫాల్లో టీఆర్ఎస్ నేతలు కూర్చోవడంగమనార్హం.

దుర్గాఘాట్‌లో బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దుర్గాఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. అనంతరం బెజవాడ ఇంద్రకీలద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... కృష్ణా నదిలో పుష్కర స్నానం పాప వినాశనం అన్నారు. ఆయన గౌతమీ పుత్ర శాతకర్ని గెటప్‌లోనే వచ్చారు.

కేసీఆర్ పుష్కర స్నానం

కేసీఆర్ పుష్కర స్నానం

ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

కేసీఆర్ పుష్కర స్నానం

కేసీఆర్ పుష్కర స్నానం

అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. ముహూర్తం ప్రకారం సరైన లగ్నంలో పుష్కరాలు ప్రారంభించాలనుకున్నామని, చేశామన్నారు.

కేసీఆర్ పుష్కర స్నానం

కేసీఆర్ పుష్కర స్నానం

ఈ సంవత్సరం ఇంకా పుష్కలంగా వానలు కురవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు. పుష్కరాలు రావడం చాలం సంతోషమన్నారు.

కేసీఆర్ పుష్కర స్నానం

కేసీఆర్ పుష్కర స్నానం

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాలను పట్టించుకోలేదు. కృష్ణా పుష్కరం అంటే బెజవాడ, గోదావరి పుష్కరం అంటే రాజమండ్రిలా ప్రచారం చేశారని మండిపడ్డారు. గత సంవత్సరం గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించామన్నారు.

 కేసీఆర్ పుష్కర స్నానం

కేసీఆర్ పుష్కర స్నానం

కృష్ణా పుష్కరాలు కూడా వైభవంగా నిర్వహిస్తామన్నారు. పుష్కర స్నానం తరువాత దైవ దర్శనం చేసుకోవడం ఆచారమని, పుష్కర స్నానం చేసి శక్తి పీఠాన్ని దర్శించుకునే అరుదైన స్థలం అలంపూర్ అన్నారు.

కేసీఆర్ పుష్కర స్నానం

కేసీఆర్ పుష్కర స్నానం

ఐదవ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ సన్నిధికి ఎందరో అమ్మవారి ఉపాసకులు వస్తుంటారని, జోగులాంబ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కేసీఆర్ పుష్కర స్నానం

కేసీఆర్ పుష్కర స్నానం

ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌తో దీనిపై చర్చిస్తామన్నారు. అలంపూర్‌కు 100 పడకల ఆసుపత్రి, మినీ బస్‌డిపో మంజూరు చేస్తామన్నారు. మారుమూల నియోజకవర్గంగా ఉన్న అలంపూర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+