KCR: నూతన సచివాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని సందర్శించారు. ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని శుక్రవారం సందర్శించారు. పనులు పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే విగ్రహ ఆవిష్కరణతో పాటు సచివాలయాన్ని కూడా ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే హుస్సేన్ సాగర్ పక్కన నిర్మిస్తున్న అమరవీరల స్మారకాన్ని కూడే అదే రోజు ప్రారంభించే అవకాశం ఉంది. సచివాలయం అంతా కలియదిరిగిన కేసీఆర్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా జూన్ 2 లోపు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.













Click it and Unblock the Notifications