Narendra Modi, Revanth Reddy: ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. మోడీతో అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు రావాల్సిన నిధులు, బకాయిలు విడుదల చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. విభజన సమస్యలతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులు వాటి అనుమతులపై కూడా చర్చించినట్లు సమాచారం.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని తొలిసారిగా కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కానున్నారు.
#WATCH | Telangana CM Revanth Reddy along with Deputy CM Bhatti Vikramarka Mallu arrives in Delhi pic.twitter.com/lHZwt4ez5d
— ANI (@ANI) December 26, 2023
పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత కె.సి.వేణుగోపాల్‌తో పాటు వీలును బట్టి రాహుల్‌గాందీతో కూడా ఈ ఇరువురు సమావేశమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications