సామాన్యుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం .. కారణం ఇదే

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తన కుటుంబసభ్యులతో సారపాక లోని బీపీఎల్ హెలిపాడ్ లో 11 గంటలకు విచ్చేశారు. భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

అనంతరం.. పర్యటనలో భాగంగా సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. బూర్గంపాడు మండలం సారపాకలో ఉంటున్న బూరం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి.. అక్కడే భోజనం చేశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల కూడా భోజనం తిన్నారు. అనంతరం ఆ కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Telangana CM Revanth Reddy Dines with Fine Rice Scheme Beneficiary

ఈ మేరకు.. దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని..ఇప్పుడు ఈ బియ్యం తినేందుకు ఉపయోగంగా ఉందని లబ్దిదారుడు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలపైనా సీఎం ఆరా తీశారు. సీఎంను చూడటానికి వచ్చిన మహిళలతోనూ ఆయన కాసేపు ముచ్చటించారు. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మహిళలు.. సీఎం రేవంత్ రెడ్డితో చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.

ఉగాది పండగ కానుకగా తెలంగాణ సర్కార్ గత వారం సన్నబియ్యం పథకం ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న లబ్దిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తోంది ప్రభుత్వం. సూర్యాపేట జిల్లాలోని హుజుర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+