జాబ్ క్యాలెండర్‌పై స్పందించిన సీఎం రేవంత్: ఏమన్నారంటే?
జాబ్ క్యాలెండర్ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనలు, డిమాండ్ల విషయంపై పార్టీ విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో చర్చించారు.
ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. కొన్ని పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావొద్దని కోరారు. పరీక్షల సమయంలో నిబంధనలు మారిస్తే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 28,942 నియామకాలు చేపట్టామని సీఎం రేవంత్ చెప్పారు. పరీక్షల తేదీలపై టీజీపీఎస్‌సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
టీజీపీఎస్సీ ఆఫీసు వద్ద ఆందోళనలు
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఈర్ఎస నేత గెల్లు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్ 2,3 పోస్టులు పెంచి డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్లు చేశారు. డీఎస్సీని 3 నెలలపాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన బర్రెలక్కను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications