అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన రేవంత్ రెడ్డి-షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తన జోక్యం ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందంటూ వ్యాఖ్యానించారు. చట్టం ముందు అంతా సమానమే అని రేవంత్ తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనలో ఒకరు చనిపోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా అదనపు షోలు వేసుకునేందుకు, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మాతలకు అనుమతులు ఇచ్చింది. దీనిపై గతంలోనే అల్లు అర్జున్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతవరకూ బాగానే ఉన్నా సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం, అభిమానుల తాకిడిలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ఆస్పత్రి పాలవడంతో ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరిగింది. దీంతో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన చేశారు.
సంధ్య థియేటర్ ఘటనపై విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఇరుకునపడింది. ముఖ్యంగా పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ ఢిల్లీలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి స్పందించారు.












Click it and Unblock the Notifications