ఎన్నికల జోష్: కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కీలక హామీలివే, వరాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకేసి మేనిఫెస్టోను ప్రకటించే పనిలో పడింది.
Recommended Video

ఈ మేరకు జీవన్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెళ్లడించారు. హౌసింగ్ స్కీంపైనే ప్రధాన చర్చ జరిగిందని తెలిపారు.

ఇళ్లు లేని వారి కుటుంబానికి 5లక్షలు, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు లక్ష అదనంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. అంతేగాక, ఇందిరమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మాణానికి రూ.2లక్షలు ఇవ్వాలని తీర్మానించింది. తెల్లరేషన్ లబ్ధిదారులకు కూడా కాంగ్రెస్ వరాలు ప్రకటించింది. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ 7కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది.
మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కళ్యాణ లక్ష్మీతోపాటు బంగారు లక్ష్మి పథకాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించారు.
దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. దివ్యాంగుల శాఖ విలీనం రద్దు చేయనున్నారు. అంతేగాక, ఇంటి విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications