తెలంగాణ కాంగ్రెస్ డిక్లరేషన్: ఎస్సీ-18, ఎస్టీ-12 శాతం రిజర్వేషన్లు: 12 హామీలతో..
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు మిగిలిన చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేస్తోంది.

ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే.. ఇందులో పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది కాంగ్రెస్. దీనికి సంబంధించిన వివరాలను మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. రాష్ట్రంలో నివసిస్తోన్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఉద్దేశించిన 12 హామీలతో కూడిన డిక్లరేషన్ ఇది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని ఖర్గే ప్రకటించారు.
हमारी सरकार जैसे ही तेलंगाना में बनेगी हम #SCSTDeclaration के 12 पॉइंट को लागू करेंगे। यह हम करके दिखाएंगे।
— Congress (@INCIndia) August 26, 2023
हमने कर्नाटक में 5 वादे किए हैं और हम उसे अमल में ला रहे हैं।
कांग्रेस जो कहती है, वो करके दिखाती है।
: तेलंगाना में कांग्रेस अध्यक्ष श्री @kharge… pic.twitter.com/06ex1lXOgd
1. ఎస్సీ రిజర్వేషన్లు పెంపు: జనాభా దామాషా ప్రకారం.. ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు. ఎస్సీ రిజర్వేషన్లల్లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణకు చర్యలు.
2. అంబేద్కర్ అభయ హస్తం: ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేత. వచ్చే అయిదేళ్లల్లో ప్రతి బడ్జెట్‌లోనూ దీనికి సరిపడేలా నిధులు కేటాయింపు. పూర్తిస్థాయిలో పథకం అమలు.
3. ప్రత్యేక రిజర్వేషన్లుఫ ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్, అన్ని కాంట్రాక్టుల్లో ఎస్సీ-18, ఎస్టీ-12 శాతం రిజర్వేషన్లు. ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్ల కల్పన.
4. ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికీ ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి ఆరు లక్షల రూపాయల ఆర్థిక సాయం.
5. అసైన్డ్ భూముల పునరుద్ధరణ- సమాన హక్కులు కింద బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి వారికే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం భూసేకరణ చట్టం 2013 కింద సమాన పరిహారం.
6. అటవీ హక్కుల చట్టం అమలు. అర్హులైన లబ్ధిదారులందరికీ పోడు భూముల పట్టాల పంపిణీ.
7. సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ఏటా ఒక్కో తండా, గూడెం గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయలు మంజూరు.
8. ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు: మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉప కులాలకు కొత్తగా మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు. వాటికి ప్రతి సంవత్సరం 750 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు.
9. ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు: తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ల ఏర్పాటు. ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు కేటాయింపు.
10. కొత్త ఐటీడీఏలు: మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్‌లల్లో కొత్త ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీల నిర్మాణం.
11. విద్యాజ్యోతుల పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణులైతే 10,000, ఇంటర్ పాసైతే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ పూర్తి చేస్తే లక్ష రూపాయలు అందజేత. ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు అయిదు లక్షల రూపాయలు.
12. రెసిడెన్షియల్ స్కూళ్లు: ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు హాస్టల్ వసతి కల్పన. విదేశాల్లోని యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత.
Congress President Shri @kharge releases the#SCSTDeclaration during the #ChevellaPrajaGarjana public meeting in Telangana. pic.twitter.com/FdrpRipnus
— Congress (@INCIndia) August 26, 2023
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications