క్రమబద్ధీకరించండి: టీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె

తెలంగాణలో ఒప్పంద విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఆరో రోజైన శనివారం నాటికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఉద్యోగ సంఘాల నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణ విద్యుత్తు ఒప్పంద ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. అయితే, పోలీసులు అర్ధరాత్రి దీక్షను భగ్నం చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. ఒప్పంద విధానం అమలును ఎత్తేయాలన్నారు. వీరు కొద్ది రోజుల క్రితం నోటికి గుడ్డలు కట్టుకొని ఒకరోజు పాటు మౌన దీక్ష చేశారు. తాజాగా ఆమరణ నిరాహార దీక్ష కోసం పది జిల్లాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎథ్తున తరలి వచ్చారు.

Telangana Contract employees dharna

విద్యుత్తు సంస్థల్లోని కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా సంస్థ ద్వారా వేతనాలు చెల్లిస్తామని, సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆరోపించారు.

వేతనాలు యాజమాన్యమే చెల్లించాలని, సినియారిటీ ప్రకారం ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలన్న తమ డిమాండ్లను అంగీకరించాలని కోరారు. కాగా, మొత్తం 22వేల మంది కాంట్రాక్ట్, పొరుగు సేవల విధానంలో విద్యుత్ సంస్థలో పని చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+