• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాపై కరోనా పంజా.. కోవిడ్ ఆంక్షల పొడిగింపు; నేటినుండే ఫీవర్ సర్వే!!

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక రాజకీయ నాయకులను సైతం కరోనా మహమ్మారి వదలడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా లేకపోవటం ప్రస్తుతం కాస్త ఊరటనిస్తుంది.

 తెలంగాణాలో కోవిడ్ ఆంక్షల పొడిగింపు

తెలంగాణాలో కోవిడ్ ఆంక్షల పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ఆంక్షలను పొడిగిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది .తాజాగా పెరుగుతున్న కేసుల నేపధ్యంలో కోవిడ్ ఆంక్షలను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు బహిరంగ సభను నిర్వహించడానికి అనుమతి ఉండదు.

ప్రజలు గుంపులు గుంపులుగా ఒకచోట చేరటం కూడా నిషేధం. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

నేటి నుండి తెలంగాణాలో ఫీవర్ సర్వే

నేటి నుండి తెలంగాణాలో ఫీవర్ సర్వే

అన్ని మత పరమైన సాంస్కృతిక రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై కూడా నిషేధం కొనసాగనుంది. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తాజాగా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తాజా సమయంలో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఫీవర్ సర్వే శుక్రవారం నుంచి ప్రారంభించనుంది కేసీఆర్ సర్కార్.

వైద్య సిబ్బంది నేటి నుండి ఇంటింటికి తిరిగి జ్వరం ఇతర లక్షణాలతో బాధపడే వారిని గుర్తించి వారికి ఉచితంగా మందులు ఇచ్చి అవి ఎలా వేసుకోవాలో వివరాలు తెలిపే కరపత్రాన్ని ఇవ్వనున్నారు.

భయంకరంగా కరోనా వ్యాప్తి; అప్రమత్తత అవసరం

భయంకరంగా కరోనా వ్యాప్తి; అప్రమత్తత అవసరం

కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిర్వహించిన ఫీవర్ సర్వే కూడా మంచి ప్రయోజనాన్ని అందించిందని, అందుకే మళ్ళీ మరోమారు ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి విపరీతంగా ఉందని, ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై, అలాగే ఫీవర్ సర్వేపై సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్ రావు పలు అంశాలను వెల్లడించారు. కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా

తాజాగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కోవిడ్-19కి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన మంత్రి 2019లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఎంపిగా నియమితులయ్యారు. పర్యాటక, సంస్కృతి మరియు అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు ట్వీట్ చేశారు. తేలికపాటి లక్షణాలతో తనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని, అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, తాను ఐసోలేషన్ లో ఉన్నానని ఆయన వెల్లడించారు.

తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల నన్ను సంప్రదించిన వారందరూ హోమ్ క్వారంటైన్ అవ్వాలని , అందరూ పరీక్షలు చేయించుకోవాలని తాను అభ్యర్థిస్తున్నాను అంటూ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఢిల్లీలో ఉన్న మంత్రి కార్యాలయంలోనూ 90 శాతం మందికి కరోనా

ఢిల్లీలో ఉన్న మంత్రి కార్యాలయంలోనూ 90 శాతం మందికి కరోనా


ఇటీవల ఢిల్లీలో గల తన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో 90 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

English summary
The extension of sanctions will continue with the throwing of the corona paw on Telangana. Fever survey will be conducted from today. Union Minister Kishan Reddy confirmed the corona as positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X