తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించాలి.!ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం.!

న్యూ ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి ఇప్పుడు ఢిల్లీ వరకూ పాకుతోంది. భాషలో,యాసలో, కట్టులో,బొట్టులో, మాటలో, మర్యాదలో, తెలంగాణకు ఉన్న ప్రత్యేకతలు ఇప్పుడు ఢిల్లీలో ప్రతిబింభించబోతున్నాయి. తెలంగాణ భవంతుల నిర్మాణాలకు ఉన్న చారిత్రాత్మకతను దేశం నలుమూలలా తెలియజేసేందుకు శ్రీకారం చుట్టబడుతోంది. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ద్వారా ఈ సాంప్రదాయాలు ఉట్టి పడేలా భవన కట్టడం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పిస్తోంది.

అందుకు తగ్గట్టుగానే తెలంగాణ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కొబ్బారికాయ కొట్టారు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విధించిన గడువులోగా నిర్మాణం పూర్తిచేసేలా పనులు వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేసారు. కీలక ఘట్టంలో తనకు భాగస్వామ్యం కల్పించిన సీఎం చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి వేముల.

 Telangana culture should be reflected.!Construction work of Telangana Bhavan begins in Delhi!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఢిల్లీ నడి బొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచే టిఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రాంభమయ్యాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం పార్టీ భవన్ నిర్మాణ పనులు మంత్రి మొదటి నుంచే దగ్గరుండి పర్యేక్షిస్తున్నారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులను స్తానికి ఢిల్లీ ప్రభుత్వం నుండి తీసుకున్నారు.

 Telangana culture should be reflected.!Construction work of Telangana Bhavan begins in Delhi!

ఎండీపి ఇన్ఫ్రా నిర్మాణ సంస్థకు భవన్ నిర్మాణ పనుల బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం లాంఛనంగా భవన్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధించిన నిర్ణీత గడువులోగా టిఆర్ఎస్ భవన్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీ నామా నాగేశ్వరరావు,నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+