GOOD NEWS: నేటి నుంచి వేసవి సెలవులు
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. నేటి నుంచి వేసవి సెలవులు పారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలకు నేటి నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రకటిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీలు జూన్ 2వ తేదీన తిరిగి పునఃప్రారంభమవనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, బోధన సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సెలవులు ప్రకటించారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక ఈనెల 25వ తేదీతో ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు 2024-25 అకడమిక్ సంవత్సరానికి శనివారమే చివరి పనిదినం. అంటే ఈనెల 30 నుంచి జూన్ 1 తేదీ వరకు వేసవి సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. తిరిగి తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు జూన్ 2న కళాశాలలు ప్రారంభమవుతాయి. ఇంటర్‌బోర్డు నిబంధనల ప్రకారం వేసవి సెలవుల్లో ఇంటర్ తరగతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించకూడదు.
ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరైనట్లు సమాచారం. పరీక్షల అనంతరం విద్యార్థులకు విశ్రాంతి అవసరమని.. వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. వేసవి సెలవుల సమయంలో విద్యార్థులు భద్రతా సూచనలను పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications