సత్తా చాటిన తెలంగాణ జిల్లాలు: స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో మరోసారి అగ్రస్థానం
తెలంగాణ జిల్లాలు మరోసారి సత్తా చాటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి చెందిన జిల్లాలు మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి.
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ జిల్లాలు మరోసారి సత్తా చాటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి చెందిన జిల్లాలు మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి. 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు త్రైమాసికానికి సంబంధించిన రెండు కేటగిరీల్లోనూ రాష్ట్రానికి చెందిన జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. 4 స్టార్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. పెద్దపల్లి జిల్లా మూడోస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లా రెండో స్థానంలో ఉంది.
3 స్థార్ కేటగిరీలో సిద్ధిపేట మొదటి స్థానంలో నిలవగా.. జగిత్యాల జిల్లా రెండోస్థానంలో నిలిచింది. 4 స్థార్ కేటగిరీలో మొదటిస్థానంలో నిలిచినందుకు సిరిసిల్ల పరిపాలన బృందాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తోపాటు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే మొదటి స్థానం రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గతాన్ని మార్చుకుని ఘనమైన వర్తమానం సొంతం చేసుకుంటున్న సిరిసిల్ల గడ్డ విజయపరంపరలో తాజా పురస్కారాలు చేరాయంటూ వ్యాఖ్యానించారు.
ఇది ఇలావుండగా, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట పరిధిలో 2వేల మంది ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ ట్యాబ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ట్యాబ్ లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చదువుల కోసం వాడాలన్నారు. ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్ లు వేసుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. మంచిగా చదువుకుని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్ లతోపాటు ఇతర రంగాల్లో మంచి ర్యాలు సాధించాలని సూచించారు. వేములవాడలో కూడా తప్పకుండా 3వేల ట్యాబ్ లు అందిస్తామన్నారు.
Congratulations Team Rajanna Siricilla led by @Collector_RSL 👍
— KTR (@KTRBRS) February 28, 2023
My compliments to All Sarpanchas, Panchayat Secretaries, MPOs and District officers 👏 https://t.co/DneziAnvwT
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆకాష్ బైజూస్ సాఫ్ట్ వేర్ ట్యాబ్ లను విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు కేటీఆర్. ఈ ట్యాబ్ ల ద్వారా పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్ అందిస్తున్నామన్నారు. బయట కొంటే ఈ ట్యాబ్ విలువ రూ. 10 వేలు, మెటీరియల్ విలువ రూ. 75 వేలు ఉంటుందని చెప్పారు. అంటే ఒక్కో ట్యాబ్ విలువ రూ. 85వేలు అని చెప్పారు. కానీ, తాము విద్యార్థుల చదువు, సంతోషం కోసం ఈ ట్యాబ్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications