కమలనాథన్ కమిటీతో అన్యాయం: తెలంగాణ డాక్టర్ల ఆందోళన, డిఎంఈ నిర్బంధం

హైదరాబాద్‌: ఉద్యోగుల విభజనలో తమకు అన్యాయం జరిగిందంటూ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఎదుట వైద్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ద్వారానికి తాళాలు వేసి, విధులు బహిష్కరించారు.

అనంతరం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కమలనాథన్‌ కమిటీకి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఆంధ్రాకు బదిలీ చేయాల్సిన వారిని తెలంగాణకు, తెలంగాణకు బదిలీ చేయాల్సిన వారిని ఆంధ్రాకు బదిలీ చేశారని ఆరోపించారు.

Telangana doctors protest against kamalnathan committee

దీంతో ఇప్పుడు కూడా ఆంధ్రా వైద్యులకే ప్రమోషన్ లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయం జరగకపోతే అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తామని వైద్యులు స్పష్టం చేశారు.

డిఎంఈ నిర్బంధం

కోఠి డీఎంఈ కార్యాలయంలో కూడా వైద్యులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల విభజనలో అన్యాయం జరిగిందంటూ వైద్యులు ఆరోపించారు. కమలనాథన్ కమిటీ నివేదిక తప్పుల తడకగా ఉందని వైద్యులు ఆరోపించారు. డీఎంఈ రమణిని గదిలో నిర్భందించిన వైద్యులు.. బయట నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+