తెలంగాణ ఎంసెట్ మే 7-14: ఇంటర్ వెయిటేజీ, 45 శాతం అమలుపై ఉత్కంఠ
తెలంగాణ ఎంసెట్ గురించి మరో అప్‌డేట్ వచ్చింది. ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభిస్తారు.
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ గురించి మరో అప్‌డేట్ వచ్చింది. ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ఇప్పటికే మొదలుపెట్టింది.
మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. మే 7 నుంచి 11 వరకు ఇంజీనింగ్ విద్యార్థులకు, మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఏర్పాట్లపై జేఎన్టీయూ కసరత్తులు ముమ్మరం చేసింది.
అయితే, ఇంటర్ వెయిటేజీ అమలు, కనీసం 45 శాతం మార్కులొచ్చి ఉండాలన్న నిబంధనలను సడలించడమా? లేక కొనసాగించడమా? అనే అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి వీటి అమలుపై జేఎన్టీయూ నిర్ణయం తీసుకోనుంది.

ప్రస్తుతం ఎంసెట్ ఒక్కో సెషన్‌కు 29వలే మంది విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సంఖ్యను 40 వేలకు పెంచాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై టీసీఎస్ అయాన్ సంస్థతో జేఎన్టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఎంసెట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయడం, ప్రశ్నాపత్రాల నార్మలైజేషన్ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది తక్కువ సెషన్లలో పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంసెట్ కు హాజరవుతున్నారు. ఒక్కో సెషన్ కు 40 వేల మంది విద్యార్థులు హాజరైతే.. ఎంసెట్ పరీక్షలను ఐదు రోజుల్లోనే పూర్తిచేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications